కళ్యాణి To చంద్ర టాన్స్ ఫర్మేషన్ అదుర్స్..!
మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి తన మార్క్ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది
By: Ramesh Boddu | 31 Oct 2025 10:09 AM ISTమలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి తన మార్క్ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. తెలుగులో హలో సినిమాతోనే ఆమె తెరంగేట్రం చేసింది. అప్పటి నుంచి మలయాళంలో మంచి మంచి రోల్స్ చేస్తూ వచ్చింది. ఐతే సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్ లో ఫస్ట్ టైం ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా లోక చేసింది. డామెరిక్ అరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మించడం విశేషం.
30 కోట్ల బడ్జెట్ తో.. 300 కోట్లు వసూళ్లు..
మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ అది కూడా 30 కోట్ల బడ్జెట్ తో అని తెలిసి అందరు షాక్ అయ్యారు. ఆ సినిమా 300 కోట్లు వసూళ్లతో సంచలనాలు సృష్టించింది. కళ్యాణి ప్రియదర్శన్ షో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. సూపర్ ఉమెన్ చంద్ర రోల్ లో కళ్యాణి పర్ఫార్మెన్స్, యాక్షన్, ఫైట్స్ అన్నీ అదిరిపోయాయి. ఐతే దీని వెనుక ఆమె ఎంత కష్టపడింది అన్నది ఎవరికీ తెలియదు. కళ్యాణ్ చంద్రాగా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యేందుకు చాలా వర్క్ అవుట్స్ చేసింది.
కళ్యాణి లోక సినిమాకు సంబంధించిన వర్క్ అవుట్ వీడియో చంద్రగా ఆమె మారేందుకు ఎలా సన్నద్ధం అయ్యింది తెలుపుతూ తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది అమ్మడు. దాదాపు స్టార్ హీరోలు ఎలా అయితే తమ యాక్షన్ సినిమాకు కష్టపడతారో దానికి ఏమాత్రం తగ్గకుండా కళ్యాణి తన ఎఫర్ట్స్ పెట్టిందని చెప్పొచ్చు. జిం వర్క్ అవుట్స్ తన ట్రైనర్ తో పాటు కళ్యాణ్ కష్టపడిన తీరు చూస్తుంటే సినిమా రిలీజ్ తర్వాత ఆమె పొందిన ప్రశంసలు అన్నిటికీ అర్హురాలని ప్రూవ్ అయ్యింది.
కళ్యాణి వీడియో సోషల్ మీడియా వైరల్..
లోక చాప్టర్ 1 చంద్ర ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో కొత్త లోక అని రిలీజ్ చేశారు. ప్రస్తుతం కళ్యాణి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హలోతో పాటు తెలుగులో సాయి ధరం తేజ్ తో చిత్రలహరి సినిమా కూడా చేసింది కళ్యాణి. ఆ సినిమాలో ఆమె ఇన్నోసెంట్ గర్ల్ గా అలరించింది. కళ్యాణిని అలా చూసిన ఆడియన్స్ చంద్ర రోల్ లో సత్తా చాటడం చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు.
కళ్యాణి ప్రియదర్శన్ కి లోక చాప్టర్ 1 హిట్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక లోక 2 లో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ ఇద్దరు నటిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలు పెట్టారని తెలుస్తుంది. లోక సక్సెస్ ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్న కళ్యాణి ఇప్పుడు ఆ సినిమా ఓటీటీ రిలీజ్ టైం లో చంద్ర రోల్ కి తను ఎలా రెడీ అయ్యానన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కళ్యాణి ఎఫర్ట్స్ ఇంకా వర్క్ పై తనకున్న కమిట్మెంట్ చూసి సూపర్ అనేస్తున్నారు ఆడియన్స్.
