Begin typing your search above and press return to search.

ఇంతలోనే అంత మార్పా.. కళ్యాణి అప్పటి లుక్ చూశారా?

తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ కి సంబంధించిన ఒక ఫోటో ఎక్స్ ఖాతాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అంతకుముందు ఆ తర్వాత అన్నట్లుగా కళ్యాణి ప్రియదర్శన్ కి సంబంధించి రెండు ఫోటోలు ఉన్నాయి.

By:  Madhu Reddy   |   9 Oct 2025 9:00 PM IST
ఇంతలోనే అంత మార్పా.. కళ్యాణి అప్పటి లుక్ చూశారా?
X

కళ్యాణి ప్రియదర్శన్.. ప్రస్తుతం ఈ హీరోయిన్ పేరే సౌత్ ఇండస్ట్రీ మొత్తం మార్మోగిపోతోంది. దానికి కారణం రీసెంట్ గా ఈ బ్యూటీ చేసిన సినిమానే.. దుల్కర్ సల్మాన్ బ్యానర్ లో వచ్చిన 'లోక చాప్టర్ 1: చంద్ర' అనే సినిమాలో తన యాక్టింగ్ తో అందర్నీ కట్టిపడేసింది కళ్యాణి ప్రియదర్శన్. అప్పటి వరకు ఈ హీరోయిన్ ఇక సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ అని అనుకున్న వాళ్ళందరూ ఈ సినిమా చూసి వాటే టాలెంట్ అని మెచ్చుకుంటున్నారు. అయితే అలాంటి కళ్యాణి ప్రియదర్శన్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన చాలా మంది జనాలు ఇదేంటి ఇది కళ్యాణి ప్రియదర్శన్ నేనా.. ఇలా ఉందేంటి.. అనే షాకింగ్ రియాక్షన్లు ఇస్తున్నారు. మరి ఇంతకీ ఆ ఫోటో వెనుక ఉన్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ కి సంబంధించిన ఒక ఫోటో ఎక్స్ ఖాతాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అంతకుముందు ఆ తర్వాత అన్నట్లుగా కళ్యాణి ప్రియదర్శన్ కి సంబంధించి రెండు ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో చాలా చబ్బీగా ఉన్న ప్రియదర్శన్ మరో ఫోటోలో సన్నబడి హాట్ లుక్ లో ఉన్న కళ్యాణి ప్రియదర్శిన్ ఫొటోస్ ఉన్నాయి. అలా రెండు ఫొటోస్ ను పక్క పక్కనే చూసిన చాలా మంది జనాలు ఇదేంటి అసలు కళ్యాణి ప్రియదర్శన్ ఇండస్ట్రీలోకి రాకముందు ఇలా ఉండేదా..? వాటే ట్రాన్స్ఫర్మేషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఈ రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్వరు ఊహించలేరబ్బా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

అయితే ఇలాంటి ఫొటోస్ సెలబ్రిటీలకు సంబంధించి చాలానే వైరల్ అవుతూ ఉంటాయి. సినిమాల్లోకి రాకముందు ఎంతో చబ్బీగా ఉంటారు. కానీ ఒక్కసారి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే వారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం మార్చేసుకుంటారు. సినిమాలకు తగ్గట్టుగా కొన్ని సర్జరీలు చేయించుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తూ సన్నబడిపోయి చాలా అందంగా తయారవుతూ ఉంటారు. అలా తవ్వకాల్లో బయటపడిన పురాతన వస్తువులాగా కొత్తలోక హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కి సంబంధించిన ఒక పాత ఫోటో వైరల్ అవ్వడంతో ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

కళ్యాణి ప్రియదర్శన్ సినిమాల విషయానికి వస్తే.. అక్కినేని అఖిల్ నటించిన హలో మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్.. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం వంటి తెలుగు సినిమాల్లో రాణించింది.ఆ తర్వాత పూర్తిగా తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయింది. రీసెంట్ గా మలయాళం లో దుల్కర్ సల్మాన్ బ్యానర్ లో వచ్చిన లోక చాప్టర్ 1: చంద్ర అనే సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించింది. అయితే ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఆ రేంజ్ వసూళ్లను కలెక్ట్ చేసిన మొట్టమొదటి హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఈ సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.