Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీలో ఆ హీరో ఎంత క్లోజ్ అంటే?

`హ‌లో` తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన బ్యూటీ క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్. తొలి సినిమాతోనే అమ్మ‌డు విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంలందుకుంది.

By:  Srikanth Kontham   |   22 Sept 2025 1:00 AM IST
ఇండ‌స్ట్రీలో ఆ హీరో ఎంత క్లోజ్ అంటే?
X

`హ‌లో` తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన బ్యూటీ క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్. తొలి సినిమాతోనే అమ్మ‌డు విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంలందుకుంది. కానీ అవ‌కాశాలు అందుకోవ‌డంలో మాత్రం విఫ‌ల‌మైంది. హ‌లో త‌ర్వాత త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కే ప‌రిమిత‌మైంది. అక్క‌డ మాత్రం బాగానే స‌క్సెస్ అయింది. కానీ గ్రాండ్ విక్ట‌రీ మాత్రం తాజాగా సొంతం చేసుకుంది. `లోక యాప్ట‌ర్ 1` తో అమ్మ‌డు భారీ విజ‌యం అందుకోవ‌డంతో సౌత్ లో క‌ల్యాణీ పేరు మారుమ్రో గిపోతుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఈ సినిమా వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధించ‌డంతో? ట్రెండింగ్ బ్యూటీగా మారింది.

సోలో స‌క్సెస్ అమ్మ‌డికి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. దీంతో అమ్మ‌డు న‌టిగా మ‌రింత బిజీ కానుంద‌ని తెలుస్తోంది. తెలుగులో కొత్త అవ‌కాశాలు అందుకోవ‌డానికి ఈ విజ‌యం దొహ‌ద‌ప‌డుతుంది. మ‌రి ఈ బ్యూటీకి ఇండ‌స్ట్రీ లో క్లోజ్ ప్రెండ్ ఎవ‌రు అంటే? మాలీవుడ్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ పేరు చెప్పింది. దుల్క‌ర్ అమ్మ‌డికి ఎంత క్లోజ్ ప్రెండ్ అంటే? ఐదేళ్ల క్రిత‌మే పరిచ‌య‌మైన బాల్య స్నేహితుడంత గొప్ప‌గా ఇద్ద‌రు కొన‌సాగుతున్న‌ట్లుగా తెలిపింది. క‌ష్ట‌మొచ్చినా? సంతోషం క‌లిగినా ఏ సెల‌బ్రేషన్ అయినా దుల్క‌ర్ తోనే అంటోంది.

కెరీర్ కి సంబంధించి స‌ల‌హాలు తీసుకోవాల‌న్నా? త‌న‌ను మాత్రమే అడుగుతానంది. ఇద్ద‌రు రెగ్యుల‌ర్ గా క‌లు స్తుంటారు. రోజులో ఒక్క‌సారైన క‌లిసి మాట్లాడుకోవ‌డం ఐదేళ్ల‌గా బాగా అల‌వాటైన ప‌నిగా తెలిపింది. అవ‌సర‌మైతే చిన్న పిల్ల‌గా మారిపోయి ఆట‌లు కూడా ఆడుకుంటామంది. మొత్తానికి దుల్క‌ర్ అమ్మ‌డికి గొప్ప స్నేహితుడ‌ని మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది. మ‌రి ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ఎలా కుదిరందంటే? ఐదేళ్ల క్రితం `వ‌ర‌ణే ఆవ‌శ్య‌మంద్` అనే చిత్రంలో క‌లిసి న‌టించారు. అప్పుడే దుల్క‌ర్ ప‌రిచ‌య‌మ‌య్యాడు.

అలా మొద‌లైన ప‌రిచ‌యం తక్కువ స‌మ‌యంలోనే స్నేహితులుగా మారారు. సాధార‌ణంగా ఇండ‌స్ట్రీలో హీరో-హీరోయిన్ మ‌ధ్య స్నేహం అన్న‌ది పెద్ద‌గా క‌నిపించ‌దు. ఏ సినిమాకు క‌లిసి ప‌ని చేసినా ఆ సినిమా వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత ఎలాంటి రిలేష‌న్ షిప్స్ క‌నిపించ‌వు. కానీ దుల్క‌ర్ త‌ర‌హాలోనే నాని, నితిన్, శ‌ర్వానంద్ లాంటి యంగ్ హీరోలు కూడా తాము ప‌ని చేసిన కొంత హీరోయిన్ల‌తో స్నేహితులుగా కొన‌సాగ‌డం క‌నిపిస్తుంటుంది.