రూ.30 కోట్ల సినిమా.. లోక సూపర్ రెస్పాన్స్
కొత్త లోక సినిమా ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. చాలా మంది ప్రేక్షకులు సైతం ఇటీవల కాలంలో విడుదలైన ఉత్తమ చిక్రం అని ప్రశంసిస్తున్నారు.
By: M Prashanth | 30 Aug 2025 10:26 PM ISTకొత్త లోక సినిమా ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. చాలా మంది ప్రేక్షకులు సైతం ఇటీవల కాలంలో విడుదలైన ఉత్తమ చిక్రం అని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ - నస్లెన్ కె. గఫూర్ కీలక పాత్రల్లో నటించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కేరళ జానపద కథలను సైన్స్ ఫిక్షన్, ఓ ఫీమేల్ సూపర్ హీరోగా కొత్త సినిమాటిక్ అనుభూతి ఇస్తుంది.
విజువల్స్ పరంగా లొక సినిమా స్టన్నింగ్ గా ఉంది. ప్రతీ ఫ్రేమ్ ప్యాషన్, విజన్ తో ఉంది. ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీలో ఒక మైలురాయి విజయంగా నిలుస్తుంది. భారత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ హీరో జానర్ కు కొత్త బెంచ్ మార్క్ నిర్దేశిస్తుంది. హీరోయిన్ కళ్యాణి తన ఇంటర్వ్యూలలో ఈ సిననిపై మార్వెల్ స్టైల్ ఆశించవద్దని, ప్రేక్షకులకు గుర్తు చేసింది. సరైన అంచనాలతో థియేటర్లలోకి ప్రవేశించిన వారు సినిమాను మరింత ఆస్వాదించారు.
అయితే బడ్జెట్ అంశం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాను కేవలం రూ. 30 కోట్లతో నిర్మించారు. అయినప్పటికీ అవుట్‌పుట్, లుక్స్ మాత్రం ఈ బడ్జెట్ కంటే గ్రాండ్‌గా, ఇంపాక్ట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాను వాటిపై తెలివిగా ఖర్చు చేశారు. అనవసరమైన ఖర్చులు, భారీ గ్రాఫీక్స్ కు బదులుగా నిర్మాతలు జేక్స్ బెజోయ్, పవర్ఫుల్ సంగీతం, ఎడిటింగ్ కోసం ఖర్చ పెట్టారు.
బాలీవుడ్ తరచుగా పెద్ద స్టార్ ల వైపు, మార్వెల్ సినిమాలవలె వరల్డ్ క్లాస్ నిర్మాణాన్ని చూపుతుంది. సౌత్ ఇండియన్ సినిమా సూపర్ హీరోస్ సినిమాలు తెరకెక్కించడంలో విజవంతమవుతుంది. బాలీవుడ్ ఖచ్చితంగా లోకా వంటి సూపర్ హీరో ఫ్రాంచైజీని తయారు చేయగలదు. కానీ ముందుగా, అది పాత అలవాట్లను నేర్చుకోవాలి.
కాగా, ఈ సినిమా అంచనాలు లేకుండా ఇవాళ గ్రాండ్ గా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా టెక్నికల్ గా వరౌట్ అయ్యింది. కేరళ జానపదాలను కలగలిపిన సూపర్ హీరో సినిమాగా రూపొందింది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆధరణ దక్కుతోంది. మౌత్ టాక్ బాగుండడంతో సినిమా లూంగ్ రన్ లో భారీ స్థాయిలో వసూళ్లు దక్కించుకునే ఛాన్స్ ఉంది.
