అంత పెద్ద సినిమా అవుతుందనుకోలేదు
కల్యాణి రీసెంట్ గా నటించిన లోక చాప్టర్1: చంద్ర మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 11 Sept 2025 3:00 AM ISTకల్యాణి ప్రియదర్శన్ గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగులో అఖిల్ తో హలో, సాయి ధరమ్ తేజ్ తో చిత్రలహరి సినిమాలు చేశారు. కల్యాణి రీసెంట్ గా నటించిన లోక చాప్టర్1: చంద్ర మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తోంది. డామినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మించారు.
రూ.30 కోట్లతో తెరకెక్కి రూ.200 కోట్ల కలెక్షన్లు
ఆగస్ట్ 29న రిలీజైన లోక సినిమా రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఆల్రెడీ రూ.200 కోట్లు కలెక్ట్ చేసింది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని బాక్సాఫీస్ వద్ బ్లాక్ బస్టర్ గా పరుగులు పెడుతోంది. లోక చాప్టర్1 సక్సెస్ అవడంపై తన ఆనందాన్ని వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు కల్యాణి.
ఫీమేల్ సూపర్ హీరో అంటున్నారు
లోక చాప్టర్1 సక్సెస్ అయినప్పటి నుంచి అందరూ తనను ఫీమేల్ సూపర్ హీరో అని పిలుస్తున్నారని, ఈ హిట్ తనకెంతో ముఖ్యమైందని, తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని, ఈ సినిమా సక్సెస్ కు తనతో పాటూ టీమ్ లోని అందరూ ఎంతో కష్టపడ్డారని, అందుకే ఈ క్రెడిట్ వాళ్లకు కూడా వెళ్తుందని, దేశంలోనే మొదటి ఫీమేల్ సూపర్ హీరో సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉందని కల్యాణి తెలిపారు.
ఎంతో మంది ఇన్‌స్పైర్ అవుతున్నారు
తాను ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటప్పుడు ఇదంత పెద్ద సినిమా అవుతుందని ఊహించలేదని, కానీ షూటింగ్ చేస్తున్నప్పుడే సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని అర్థమైందని, లోక చాప్టర్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ అవడంతో ఎంతో మంది ఇది చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారని, ఈ సినిమాతో హీరోయిన్స్ కూడా ఎలాంటి క్యారెక్టర్లైనా చేయగలరనే నమ్మకం అందరికీ కలిగిందని ఆమె అన్నారు.
