ఓపెన్ బ్యాక్ లుక్‌తో కిల్ చేస్తున్న బ్యూటీ!
ఇటీవలే ఫహద్ ఫాజిల్ తో కలిసి నటించిన `కుతిర చాదుం కుతిర` విడుదలైంది. ఇది ఓటీటీలో విడుదలైనా, తన నటనకు ప్రశంసలు అందుకుంది కళ్యాణి.
By: Sivaji Kontham | 31 Dec 2025 4:00 AM ISTకరణ్ జోహార్ అంతటివాడు పొగిడేసాడు.. 2025లో `లోకా చాప్టర్1- చంద్ర` తనకు నచ్చిన ఉత్తమ సినిమాల్లో ఒకటి అని..!!. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి కళ్యాణి ప్రియదర్శన్ నటప్రదర్శన, కంటెంట్ పై దిగ్గజ దర్శకనిర్మాత పొగడ్తల వర్షం కురిపించారు. సాయిధరమ్ సరసన `చిత్రలహరి`లో నటించిన ప్రియదర్శిని, కొన్ని ఇతర కమర్షియల్ సినిమాల్లో నటించింది. కానీ వాటితో రాని గుర్తింపును ఒకే ఒక్క ఫాంటసీ డ్రామా `లోకా`తో సంపాదించింది. నాయికా ప్రధాన పాత్రలో కళ్యాణి నటనకు మంచి పేరొచ్చింది. మలయాళ చిత్రపరిశ్రమలో చాలామంది అగ్ర హీరోలు సాధించలేని రూ.300 కోట్ల క్లబ్ ని అందుకుంది ప్రియదర్శిని. ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన నటీమణులలో ఒకరిగా కళ్యాణి పేరు మార్మోగింది.
ఇటీవలే ఫహద్ ఫాజిల్ తో కలిసి నటించిన `కుతిర చాదుం కుతిర` విడుదలైంది. ఇది ఓటీటీలో విడుదలైనా, తన నటనకు ప్రశంసలు అందుకుంది కళ్యాణి. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత మరో ప్రశంస.. ఈ భామలో గొప్ప ఉత్సాహం నింపింది. ఇక ఇదే హుషారులో కళ్యాణి వరుస ఫోటోషూట్లలో పాల్గొంటోంది. లుక్ పరంగా ప్రయోగాలకు వెనకాడటం లేదు. ఇప్పుడు సహజసిద్ధత- డీసెన్సీ చెడకుండా, ఓపెన్ బ్యాక్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోషూట్ కోసం ఎంపిక చేసుకున్న డార్క్ థీమ్ డ్రెస్ ఎంతగానో ఆకట్టుకుంది. కళ్యాణి చూడటానికి ఎంత సింపుల్‌గా కనిపిస్తోందో, అంతకుమించి ట్రెండీగాను తనను ఎలివేట్ చేసుకోగలదు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతోంది.
కళ్యాణి ప్రియదర్శన్ వెరీ డీసెంట్.. కానీ సంథింగ్ స్పెషల్ ట్యాలెంట్! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. `లోకా` ఫ్రాంఛైజీలో కళ్యాణి మరిన్ని అద్భుతాలు చేస్తుందని కూడా భావిస్తున్నారు. ఈ భామ తదుపరి వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉంది. జెనీ, మార్షల్ అనే భారీ చిత్రాల్లో నటిస్తోంది. `లోకా`తో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత, కళ్యాణి ఈ ఏడాది తమిళ పరిశ్రమలోను రాణించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.
మంచి స్నేహంతో విలువ
ఏ పరిశ్రమలో అయినా మంచి స్నేహాలు, అనుబంధాలు ఎప్పుడూ ఎదుగుదలకు కీలకం. అలాంటి మంచి స్నేహితుడు ఉన్నాడు కళ్యాణి ప్రియదర్శన్‌కు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లాంటి ఒక సోదరుడు, స్నేహితుడు తనకు ఉన్నాడు. లోకా-చాప్టర్ 1 గ్రాండ్ సక్సెస్ సాధించడం వెనక చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్ పెట్టుబడి, ప్రణాళిక, స్నేహితురాలి విజయం కోసం అతడు తపించిన తీరు చాలా ముఖ్యమైనవి. బహుశా కళ్యాణి విజయం వెనక మంచి స్నేహితుడు ఉన్నాడంటే అతిశయోక్తి లేదు.
