క్యూట్ హీరోయిన్ తెలుగులో ఎప్పుడు..?
మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా తన టాలెంట్ చూపిస్తుంది.
By: Ramesh Boddu | 24 Aug 2025 7:00 PM ISTమలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా తన టాలెంట్ చూపిస్తుంది. తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది అమ్మడు. ప్రస్తుతం ఆమె లోక సినిమాతో ఈ నెల చివరన వస్తుంది. ప్రేమలు హీరో నెస్లన్ తో కలిసి కళ్యాణి ప్రియదర్శన్ చేసిన ఈ లోక సినిమాను డామినిక్ అరుణ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను వేఫారర్ ఫిలిమ్స్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ నిర్మించారు.
కొత్త లోక టైటిల్ తో..
ఆగష్టు 28న ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అవుతుండగా ఈ సినిమాను అదే రోజు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కొత్త లోక టైటిల్ తో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ మూవీని సితార బ్యానర్ రిలీజ్ చేస్తుంది. ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా వస్తున్న కొత్త లోక మీద హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మలయాళ సినిమాలు ఎప్పుడూ కొత్త కంటెంట్ తో సినిమాలు చేస్తారు. ఐతే ఈ కొత్త లోక కూడా కొత్త ప్రయత్నమే అని అంటుంది అమ్మడు.
కొత్త లోకాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరిస్తుంది కళ్యాణి. అమ్మడు అంతకుముందు అఖిల్ తో హలో, సాయి ధరం తేజ్ తో చిత్రలహరి సినిమాలు చేసింది. ఆ తర్వాత ఎందుకో అమ్మడు తెలుగులో సినిమాలు చేయలేదు. ఆఫర్లు రాలేదా లేదా వచ్చినా కూడా కళ్యాణి చేయనని అన్నదా అని తెలియదు కానీ కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం తెలుగులో అసలు కనిపించట్లేదు.
మోహన్ లాల్, ప్రియదర్శన్ బెస్ట్ ఫ్రెండ్స్..
కొత్త లోక సినిమా ప్రమోషన్స్ కి ఇక్కడికి వస్తే మాత్రం కచ్చితంగా తెలుగులో నటించే విషయంపై ఆమెని నెటిజెన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తారని చెప్పొచ్చు. లోక ఇంటర్వ్యూలో తనకు ప్రణవ్ మోహన్ లాల్ బెస్ట్ ఫ్రెండ్ అని.. మా గురించి ఎవరేం అనుకున్నా కూడా మా ఇద్దరికి ఒకరంటే ఒకరం బాగా తెలుసు మాకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటుంది కళ్యాణి.
ప్రణవ్ తో కలిసి కళ్యాణి హృదయం సినిమా చేసింది. ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అందుకుంది. మోహన్ లాల్, ప్రియదర్శన్ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడంతో ప్రణవ్, కళ్యాణిలు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. హృదయం సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. కళ్యాణి ప్రియదర్శన్ డబ్బింగ్ సినిమా కొత్త లోక్ తెలుగు ఆడియన్స్ ని ఏమేరకు ఇంప్రెస్ చేస్తుందో చూడాలి. రీసెంట్ గా వచ్చిన ప్రమోషనల్ టీజర్ అయితే సినిమాపై మంచి హైప్ పెంచింది. కళ్యాణి ఈ ప్రాజెక్ట్ క్లిక్ అయితే ఇదే రూట్ లో మరిన్ని సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది.
