"హాట్ వాటర్ గ్యాంగ్".. సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణి ప్రియదర్శన్!
అలా తెలుగులో ఈ సినిమా కొత్త లోక అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చాలామంది ఈ సినిమా చూడడానికి పరుగులు పెడుతున్నారు.
By: Madhu Reddy | 5 Sept 2025 4:31 PM ISTకళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ పోషించిన తాజా మూవీ 'కొత్తలోక'..ఈ సినిమా మలయాళంలో 'లోక చాప్టర్ 1:చంద్ర' పేరుతో విడుదలై అద్భుతమైన హిట్ అందుకుంది.. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా చేసిన ఈ సినిమాకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. మలయాళం ఓనం సందర్భంగా ఆగస్టు 28న విడుదలైన లోక చాప్టర్ 1:చంద్ర మూవీ మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాని తెలుగులో ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ విడుదల చేశారు. అలా తెలుగులో ఈ సినిమా కొత్త లోక అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చాలామంది ఈ సినిమా చూడడానికి పరుగులు పెడుతున్నారు.
ఈ మధ్యకాలంలో వచ్చిన ది బెస్ట్ సినిమాలలో కొత్త లోక ఒకటి అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమా మలయాళం లో కేవలం 30 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కింది. కానీ వారం రోజుల్లోనే 100 కోట్లు వసూళ్లు చేయడంతో చాలామంది ఆశ్చర్యంతో నోరేళ్లబెడుతున్నారు. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ యాక్షన్ హీరో పాత్రలో నటించింది. అంతేకాదు మలయాళంలో విడుదలైన మొట్టమొదటి లేడీ సూపర్ హీరో సినిమా కూడా ఇదే.. అయితే అలాంటి కొత్త లోక మూవీ విడుదలై సరికొత్త సంచలనం సృష్టించడంతో ఈ సినిమా పేరు, సినిమాలో నటించిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది.
అయితే తాజాగా కొత్తలోక చిత్ర యూనిట్ అందరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సుమ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది. ఇందులో భాగంగా మీకు ఇష్టమైన డ్రింక్ ఏంటి అని కళ్యాణి ప్రియదర్శిన్ ని అడగగా.. నాకు హాట్ వాటర్ అంటే ఇష్టం.. "ఐ లైక్ హాట్ వాటర్.. మార్నింగ్ లేవడంతోనే హాట్ వాటర్ తాగుతాను" అంటూ అందరూ ఆశ్చర్యపోయే ఆన్సర్ ఇచ్చింది. అయితే ఫేవరెట్ డ్రింక్స్ అంటే ఎవరైనా ఫ్రూట్స్ డ్రిక్స్ లేదా కూల్ డ్రింకుల పేర్లు చెబుతారు.
కానీ కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం వెరైటీగా హాట్ వాటర్ ఇష్టం అని చెప్పడంతో పాటు మాకు "హాట్ వాటర్ గ్యాంగ్" అనే సిల్లీ వాట్సప్ గ్రూప్ కూడా ఉంది అని చెప్పుకొచ్చింది. ఉదయం లేవగానే ఒక హాట్ వాటర్ గ్లాస్ ఫోటో పోస్ట్ చేస్తానని.. నైట్ పడుకునేటప్పుడు కూడా అలాంటి ఒక ఫోటో మళ్లీ షేర్ చేస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఉదయం లేవగానే హాట్ వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అని కూడా కళ్యాణి తెలిపింది. ఇకపోతే అంతా బాగానే ఉన్నా.. దీని కోసం ఒక గ్రూప్ కూడా ఉందని తెలిసి అటు సుమా కూడా తనదైన శైలిలో ఆటపట్టించింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన చాలా మంది అభిమానులు.. కెరియర్లో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ వాళ్లకి టైం కేటాయిస్తూ ఉంటే.. ఎంత స్ట్రెస్ అయినా సరే చాలా తేలిగ్గా తగ్గించుకోవచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా ఇలాంటి సిల్లీ గ్రూప్స్ తమకు కూడా ఉన్నాయని మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
