ముంబైకి మకాం మార్చేసిన బ్యూటీ!
జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జాంబీ థ్రిల్లర్ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తున్నారు.
By: Srikanth Kontham | 30 Sept 2026 8:00 PM ISTమలయాళ, తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కల్యాణీ ప్రియదర్శన్ హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ `ప్రళయ్` తో అమ్మడు నార్త్ ఆడియన్స్ ను పలకరించనున్నారు. ఇప్పటికే అమ్మడు షూటింగ్ లో జాయిన్ అయింది. షూటింగ్ కోసం అమ్మడు చెన్నై టూ ముంబై తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణాలు చేయలేక కల్యాణీ పూర్తిగా ముంబైకి మకాం మారుస్తున్నట్లు తెలిసింది.
జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జాంబీ థ్రిల్లర్ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సాధారణ దినచర్యను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలో ప్రత్యేకంగా నివాసం ఏర్పాటు చేసుకుని సినిమాకు సంబంధించిన సన్నాహాలలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో పాత్ర కోసం కళ్యాణి యాక్షన్ కు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.
జాంబీ థ్రిల్లర్ జానర్ కావడంతో సినిమాలో ఊహించని యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్‌లు ఉన్నాయట. ఇందుకోసం ఆమె ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో కఠినమైన వర్కవుట్లు, మార్షల్ ఆర్ట్స్ , హ్యాండ్-టూ-హ్యాండ్ కంబాట్ ట్రైనింగ్ తీసుకుంటూ ఫిట్‌నెస్‌ను నెక్స్ట్ లెవెల్‌కు మార్చుకుంటున్నారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన డైట్ ప్లాన్‌ను కూడా కఠినంగా ఫాలో అవుతున్నారు. పాత్ర డిమాండ్ చేసే శారీరక దారుఢ్యం, చురుకుదనం కోసం పోషకాహార నిపుణుల సలహాలు తీసుకుంటూ శరీరాన్ని సినిమాకు తగినట్లుగా మలుచుకుంటున్నారు. పాత్రలో జీవించడం కోసం ఆమె పడుతున్న కష్టంపై చిత్ర యూనిట్ కూడా ప్రశంసలు కురిపిస్తోంది.
రణ్‌వీర్ సింగ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, అదీ జై మెహతా వంటి ప్రతిభావంతుడైన డైరెక్టర్ తెరకెక్కిస్తున్న జాంబీ థ్రిల్లర్‌లో నటించడం కెరీర్‌కు బిగ్ బూస్ట్ ఇస్తుందని కళ్యాణి భావిస్తున్నారు. విభిన్న కథాం శాలతో దూసుకుపోతున్న జై మెహతా మేకింగ్ స్టైల్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే కల్యాణీ కి బాలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. కెరీర్ ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా? గత ఏడాది రిలీజ్ అయిన `లోక చాప్టర్ వన్ చంద్ర` తో మాత్రం ఇండియాలో బాగా ఫేమస్ అయింది. అందులో అమ్మడు పోషించిన పాత్ర ఆ రేంజ్ కు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా అవకాశం వరించింది.
