Begin typing your search above and press return to search.

జీనీ ఫస్ట్ సింగిల్.. కళ్యాణి ప్రదర్శన పై ఫ్యాన్స్ అసహనం?

అదే సినిమాని తెలుగులో 'కొత్తలోక' అంటూ విడుదల చేసి ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

By:  Madhu Reddy   |   8 Oct 2025 5:00 PM IST
జీనీ ఫస్ట్ సింగిల్.. కళ్యాణి ప్రదర్శన పై ఫ్యాన్స్ అసహనం?
X

ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిస్సి దంపతుల కుమార్తెగా.. 2017లో హలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. ఈ సినిమా తర్వాత చిత్రలహరి, రణరంగం చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. కానీ ఇటీవల ' లోకా చాప్టర్ 1: చంద్ర' అంటూ మలయాళంలో సినిమా చేసింద




అదే సినిమాని తెలుగులో 'కొత్తలోక' అంటూ విడుదల చేసి ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇందులో లేడీ సూపర్ హీరో గెటప్ లో నటించి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఏకంగా రూ.300 కోట్ల క్లబ్లో చేరింది . అంతేకాదు ఇండియన్ సినీ చరిత్రలో సూపర్ హీరో పాత్ర పోషించిన తొలి హీరోయిన్గా కూడా రికార్డ్ సృష్టించింది.

అలాంటి ఈమెపై ఇప్పుడు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కారణం తాజాగా ఈమె నటిస్తున్న జీని సినిమా నుండి విడుదలైన "అబ్డి.. అబ్డి" పాట అని చెప్పవచ్చు. విషయంలోకి వెళ్తే.. రవి మోహన్ అలియాస్ జయం రవి హీరోగా కృతి శెట్టి, వామికా గబ్బి, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న చిత్రం జీని..భువనేష్ అర్జునన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై డా. దాసరి కె. గణేష్ నిర్మిస్తున్నారు. తమిళ్ , తెలుగు, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి అబ్డి.. అబ్డి అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి పోటీపడి మరి బెల్లీ డాన్స్ మూమెంట్స్ తో ఆడియన్స్ ను అబ్బురపరిచారు. ఇకపోతే ఈ ప్రదర్శనలో కళ్యాణి చాలా అద్భుతంగా డాన్స్ చేసినా.. అభిమానులు మాత్రం ఈమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. కళ్యాణి ప్రియదర్శన్ ఇటీవల విడుదలైన కొత్త లోక సినిమాలో సూపర్ యోధ పాత్రలో తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలాంటి ఈమె ఇప్పుడు ఇలా బెల్లీ డాన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్.. ? అసలు కొత్త లోక సక్సెస్ తరువాత ఈమె ఈ పాటకు ఫిట్ అయ్యిందా? అంత పెద్ద సక్సెస్ అందుకున్న కళ్యాణి.. అసలు ఇలాంటి పాట చేయడానికి ఎలా ఒప్పుకుంది? అంటూ పలు రకాల కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల అసహనంపై కళ్యాణి ప్రియదర్శన్ ఎలాంటి కామెంట్లు చేస్తుందో చూడాలి.