కళ్యాణ్, తనూజ జోడీగా సినిమా..?
బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల రన్నరప్ తనూజ ఇద్దరు కూడా హౌస్ లో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేశారు.
By: Ramesh Boddu | 29 Dec 2025 8:00 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల రన్నరప్ తనూజ ఇద్దరు కూడా హౌస్ లో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేశారు. కళ్యాణ్ టైటిల్ గెలిచేందుకు ఓ విధంగా హౌస్ లో తనూజ ఇచ్చిన సపోర్ట్ కూడా ఉందని చెప్పడంలో సందేహం లేదు. కళ్యాణ్ తనూజని ఇషపడుతున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమెతో ఈ 105 రోజుల జర్నీలో ఏర్పడ్డ ఫ్రెండ్ షిప్ అతనికి ఒక మంచి జ్ఞాపకంగా మిగిలేలా ఉంది.
తనూజ మీద కళ్యాణ్ స్పెషల్ ఇంట్రెస్ట్..
తనూజ మీద కళ్యాణ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అతనికి ఆమె మీద ఉన్న ప్రేమను తెలిసేలా చేసింది. తనూజ కూడా కళ్యాణ్ ని వద్దు వద్దు అంటూనే అతనితో ఫ్రెండ్ షిప్ కొనసాగించింది. ఐతే ఇద్దరు ఒకరంటే ఒకరు అభిమానంతో ఉన్నారు. ఆ విషయంలో డౌట్ పడాల్సింది లేదు. ఐతే హౌస్ లో వాళ్లిద్దరు ఉన్నప్పుడే ఇద్దరినీ మ్యూచువల్ గా ఇష్టపడే కొందరు బయటకు వచ్చాక కూడా వీళ్లు ఇలానే ఉంటే బాగుంటుందని అన్నారు.
కళ్యాణ్ టైటిల్ విన్నర్ అయ్యాడు కాబట్టి అతని డ్రీం అయిన సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆఫర్లు రావడమే ఆలస్యం అతను సినిమాలు చేస్తాడు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 ఆడియన్స్ కోరిక ఏంటంటే కళ్యాణ్ హీరోగా చేసే సినిమాలో తనూజని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. కళ్యాణ్, తనూజ జత కడితే చూడాలని ఉందని వారు కోరుతున్నారు.
జోడీగా ఒక సినిమా చేస్తే..
బిగ్ బాస్ లో ఇలా జతగా కనిపించిన వారు బయటకు రాగానే ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఐతే ఈ ఇద్దరికీ సినిమా డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ల జోడీగా ఒక సినిమా చేస్తే బెటర్ అంటున్నారు. కళ్యాణ్ అందుకు ఓకే అనేస్తాడేమో కానీ తనూజ విషయంలో డౌట్ ఉంది. ఎందుకంటే తనూజకి ఆల్రెడీ బయట తన బాయ్ ఫ్రెండ్ పవన్ సాయి ఉన్నాడు.
తనూజ విషయంలో ఏ నిర్ణయమైనా అతని ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని టాక్. సో పవన్ సాయి కళ్యాణ్ తో తనూజ సినిమా అంటే ఒప్పుకుంటాడా అన్నది డౌటే. మొత్తానికి ఆడియన్స్ అయితే కళ్యాణ్, తనూజ హీరో హీరోయిన్ గా సినిమా చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఏ డైరెక్టర్ అయినా ఆడియన్స్ లో ఈ ఇద్దరి మీద ఉన్న బజ్ చూసి ఆ కాల్ తీసుకుంటారేమో చూడాలి.
సినిమా ఛాన్స్ లు రాకపోయినా సరే తనూజకు బిగ్ బాస్ క్రేజ్ తో సీరియల్స్ ఛాన్స్ లు వస్తాయి. ఐతే కళ్యాణ్ కూడా తన ఆర్మీ జాబ్ చేస్తూనే సినిమాల్లో ప్రయత్నించాలని చూస్తున్నాడు. సినిమాల్లో కళ్యాణ్ క్లిక్ అయితే అతనికి ఓటు వేసి గెలిపిన ప్రతి ఆడియన్ హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పొచ్చు.
