కోలీవుడ్ స్టార్‌తో మ్యాడ్ డైరెక్టర్ మంతనాలు..
టాలీవుడ్ యూత్‌కు 'మ్యాడ్' సినిమాతో పిచ్చెక్కించిన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యాన్ అయిపోయారు.
By: M Prashanth | 31 Jan 2026 2:12 PM ISTటాలీవుడ్ యూత్‌కు 'మ్యాడ్' సినిమాతో పిచ్చెక్కించిన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యాన్ అయిపోయారు. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర నవ్వుల పూయించిన ఈ డైరెక్టర్, ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కళ్యాణ్, తన లైనప్‌ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు క్రేజీ ఐడియాలు ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
సాధారణంగా ఒక హిట్ పడగానే పెద్ద హీరోల వెంట పడటం కామన్, కానీ కళ్యాణ్ శంకర్ మాత్రం తన మార్క్ కామెడీని నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే 'MAD జూనియర్స్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించి, దాంతో ఒక హారర్ కామెడీ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇందులో అంతా కొత్త వాళ్లే ఉంటారని, హారర్ జోనర్‌లో తన స్టైల్ కామెడీని మిక్స్ చేసి ప్రేక్షకులను భయపెడుతూనే నవ్వించాలని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు.
అయితే ఈ చిన్న సినిమా కాకుండా కళ్యాణ్ శంకర్ అకౌంట్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ కూడా వచ్చి చేరిందట. అసలు విషయం ఏంటంటే.. కోలీవుడ్ హీరో కార్తీతో కళ్యాణ్ శంకర్ ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నారనే టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే సూర్యతో ఒక సినిమా చేస్తున్న నాగవంశీ, ఇప్పుడు తమ్ముడు కార్తీని కూడా టాలీవుడ్‌లోకి నేరుగా దింపాలని చూస్తున్నారు. కార్తీకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కార్తీ బాడీ లాంగ్వేజ్‌కు కళ్యాణ్ శంకర్ మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఇక్కడే ఒక చిన్న కన్‌ఫ్యూజన్ నడుస్తోంది. కళ్యాణ్ శంకర్ ముందుగా కొత్త వాళ్లతో చేసే హారర్ కామెడీని మొదలుపెడతారా లేక కార్తీతో చేసే భారీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కార్తీ సినిమా కోసం ఒక డిఫరెంట్ కథను కళ్యాణ్ సిద్ధం చేశారని, అది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని లీకులు అందుతున్నాయి.
కార్తీకి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఇది ఒక పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏది ఏమైనా కళ్యాణ్ శంకర్ మాత్రం సితార కాంపౌండ్‌లోనే ఉంటూ తన ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కార్తీకి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి, కళ్యాణ్ శంకర్ రాసే పంచ్ డైలాగులు ఆయనకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయనడంలో డౌట్ లేదు. ఒకవేళ హారర్ మూవీ కంప్లీట్ అయ్యాక కార్తీ సినిమా మొదలైతే, అప్పటికి కళ్యాణ్ శంకర్ మీద మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చర్చలు చాలా ప్రాథమిక దశలోనే ఉన్నా, సితార బ్యానర్ ప్లానింగ్ చూస్తుంటే ఈ ఇద్దరి కాంబోలో సినిమా రావడం దాదాపు పక్కా అనిపిస్తోంది. దీనిపై అఫీషియల్ క్లారిటీ వస్తే కానీ అసలు ముహూర్తం ఎప్పుడనేది తెలియదు.
