Begin typing your search above and press return to search.

#NKRAR2 జెట్‌స్పీడ్‌తో.. క‌ళ్యాణ్‌రామ్ బ‌ర్త్ డే గిఫ్ట్ రెడీనా?

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ కాంబినేషన్లకు కొదవలేదు. కానీ ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు టాలెంటెడ్ హీరోలు కనిపిస్తే ఆ కిక్కే వేరు.

By:  Sivaji Kontham   |   2 July 2026 9:23 AM IST
#NKRAR2 జెట్‌స్పీడ్‌తో.. క‌ళ్యాణ్‌రామ్ బ‌ర్త్ డే గిఫ్ట్ రెడీనా?
X

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ కాంబినేషన్లకు కొదవలేదు. కానీ ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు టాలెంటెడ్ హీరోలు కనిపిస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అలాంటి ఒక క్రేజీ మల్టీస్టారర్ చిత్రం గురించిన ముచ్చట గట్టిగా వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NKRAR2 (#VenkyAnil5) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ ని రావిపూడి త‌న‌దైన స్టైల్ లో ప‌రుగులు పెట్టిస్తున్నాడు.

ఇంత‌లోనే ఒక కీల‌క‌మైన డేట్ రావిపూడి ప్ర‌మోష‌న్స్‌కి కలిసి రానుంది. జూలై 5న కళ్యాణ్ రామ్ బర్త్ డే కానుకగా.. ఈ సినిమా నుండి క‌ళ్యాణ్ రామ్ లుక్ ని కానీ, ఏదైనా గ్లింప్స్‌ను కానీ అభిమానుల కోసం అందించే వీలుంద‌ని గుసగుసలు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ బిగ్ అప్ డేట్ కోసం నందమూరి, విక్ట‌రీ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడికి.. కళ్యాణ్ రామ్‌కు మధ్య ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. కళ్యాణ్ రామ్‌లోని అసలైన కామెడీ టైమింగ్‌ని, అద్భుత నటనను `పటాస్` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం చేసింది ఈ ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ తాజా మల్టీస్టారర్‌లో అంతకంటే మెరుగైన.. హిలేరియస్ కామెడీని రాబట్టేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ని, క‌ళ్యాణ్ రామ్ పాత్ర‌ను డిజైన్ చేశారట. సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో.. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌లో క‌ళ్యాణ‌రాముని పాత్ర చాలా మ్యాజిక్ చేయ‌బోతోంద‌ని సమాచారం.

విక్టరీ వెంకటేష్‌తో కలిసి మ్యాజిక్ చేయాల‌నే ఉత్సాహం కళ్యాణ్ రామ్ లో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. అయితే ఈ క్రేజ్ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. భవిష్యత్తులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి టాలీవుడ్ దిగ్గజ హీరోలతో కూడా కళ్యాణ్ రామ్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఇత‌ర‌ అగ్ర హీరోలతో మరిన్ని మల్టీస్టారర్లు ప్లాన్ చేస్తే.. అది కచ్చితంగా కళ్యాణ్ రామ్ కెరీర్‌కు భారీ మైలేజ్ ఇచ్చేదే అవుతుంది. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న కళ్యాణ్ రామ్‌కు ఈ తరహా సినిమాలు కొత్త ఎనర్జీని ఇస్తాయనడంలో సందేహం లేదు.

ఇక బాక్సాఫీస్ సెంటిమెంట్స్ విషయానికి వస్తే.. అనిల్ రావిపూడికి ఒక ప్రత్యేకమైన రూట్ మ్యాప్ ఉంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా.. ముఖ్యంగా భోగి రోజున అంటే జనవరి 13న రిలీజ్ చేయడానికి గట్టిగానే టార్గెట్ చేశారు. గతంలో వెంకటేష్‌-వ‌రుణ్‌తో చేసిన `ఎఫ్ 2` జనవరి 12న, అలాగే చిరు-వెంకీల‌తో `మన శంకరవ‌ర‌ప్రసాద్` జనవరి 14న విడుదలై సంచలనాలు సృష్టించాయి. ఇలా భోగి పండుగకు అటూ ఇటూగా సినిమాలను రిలీజ్ చేస్తూ అనిల్ రావిపూడి చేసే గమ్మత్తయిన ప్లానింగ్స్ ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా కూడా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను గ్యారెంటీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

నిజానికి అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో ఒక `హిట్ మిషన్`లా మారారు. గతంలో ఎఫ్ 2, స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాలు సంక్రాంతి బ‌రిలోనే విడుద‌లై భారీ విజయాలతో సాలిడ్ వ‌సూళ్ల‌ను సాధించాయి. ఇక దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా, సాహు గారపాటి నిర్మాణంలో జనవరి 14న వచ్చిన `మన శంకర్ ప్రసాద్` ఇదే తీరుగా భారీ వ‌సూళ్ల‌ను సాధించాయి. వరుసగా సంక్రాంతి సీజన్లనే టార్గెట్ చేస్తూ హిట్లు కొడుతున్న ఈ యువ ద‌ర్శ‌కుడు తన 10వ సినిమాతోను సక్సెస్ ని రిపీట్ చేయ‌బోతున్నారు. #NKRAR2 కూడా బాక్సాఫీస్ వద్ద పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.