Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. మొదటి ఫైనలిస్ట్ గా గెలిచింది ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి ఫైనలిస్ట్ గా కామనర్ కళ్యాణ్ పడాల నిలిచాడు. సీజన్ 9లో మొదటి నుంచి తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చాడు కళ్యాణ్ పడాల.

By:  Ramesh Boddu   |   6 Dec 2025 10:42 AM IST
బిగ్ బాస్ 9.. మొదటి ఫైనలిస్ట్ గా గెలిచింది ఎవరంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి ఫైనలిస్ట్ గా కామనర్ కళ్యాణ్ పడాల నిలిచాడు. సీజన్ 9లో మొదటి నుంచి తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చాడు కళ్యాణ్ పడాల. తనూజతో ఫ్రెండ్ షిప్ ఆటలో సపోర్ట్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. అంతేకాదు మిగతా హౌస్ మేట్స్ తో కూడా కళ్యాణ్ మంచి బాండింగ్ ఏర్పరచుకున్నాడు. ఆటకి ఆట ఆడుతూ అందరి మనసులు గెలిచాడు. ఫైనల్ గా ఈ వారం జరిగిన టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు. కళ్యాణ్ పడాల మొదటి ఫైనలిస్ట్ అవ్వడం అతన్ని ఇష్టపడి అతనికి ఓట్ వేసే ఆడియన్స్ ని ఖుషి చేసింది.

కళ్యాణ్, రీతూల మధ్య ఫైనల్ టాస్క్..

ఐతే ఈ సీజన్ లో మొదటి ఫైనలిస్ట్ అదే టికెట్ టు ఫినాలే టాస్క్ లో చివరి యుద్ధం ఫైనల్ టాస్క్ కళ్యాణ్, రీతూల మధ్య జరిగింది. ఈ ఇద్దరికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాస్త కష్టంగానే ఉంది. యాక్టివిటీ ఏరియాలో ఏర్పాటు చేసిన కీస్ తీసుకుని మధ్యలో ఇచ్చిన బాక్స్ లో పాకుతూ వచ్చి లివింగ్ ఏరియాలో ఇచ్చిన ఒక స్టాండ్ ద్వారా దాటుకుంటూ వెళ్లి ఫైనల్ గా గార్డెన్ ఏరియాలో తమకు ఇచ్చిన బాల్స్ ని కిందపడకుండా ఒక బాక్స్ లో వేయాలి. మొదటి బాల్ బాక్స్ లో పడ్డాక తన ఫోటో ఫజిల్ ని సరిగా ఏర్పరచి మిగతా రెండు బాల్స్ కూడా బాక్స్ లో వేయాలి.

ఐతే ఈ టాస్క్ లో మొదటి నుంచి కళ్యాణ్ దూకుడుగా కనిపించాడు. ఫైనల్ టాస్క్ లో కూడా అతను అదరగొట్టాడు ఫైనల్ గా ఈ సీజన్ టికెట్ టు ఫినాలే టాస్క్ విన్ అయ్యి మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. ఈ సీజన్ లో ఆల్రెడీ కళ్యాణ్ పడాల విన్నింగ్ కెపాసిటీ ఉందని బజ్ నడుస్తుండగా టికెట్ టు ఫినాలే టాస్క్ విన్ అయ్యి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు.

కామనర్ కేటగిరిలో సీజన్ 9లో అడుగు పెట్టిన కళ్యాణ్ పడాల..

ఆర్మీ నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఇంప్రెస్ చేసి కామనర్ కేటగిరిలో సీజన్ 9లో అడుగు పెట్టాడు. ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ విజేతగా నిలుస్తాడా లేదా అన్నది మరో రెండు వారాల్లో తెలుస్తుంది.

ఈ సీజన్ లో టైటిల్ రేసులో తనూజ, ఇమ్మాన్యుయెల్ తో పాటు కళ్యాణ్ కూడా దూసుకొస్తున్నాడు. కళ్యాణ్ ఫైనలిస్ట్ అవ్వడంతో అతనితో ఎవరు విన్నింగ్ రేసులో ఉంటారా అన్నది సస్పెన్స్ గా మారింది. తప్పకుండా ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది ఆడియన్స్ కి కాస్త టఫ్ అయ్యేలా ఉంది.