Begin typing your search above and press return to search.

సినిమాలా.. సైనికుడా.. కళ్యాణ్ పడాల దారెటు..?

బిగ్ బాస్ సీజన్ 9లో టైటిల్ విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల ఒక కామన్ మ్యానే.. ఐతే అతను ఆల్రెడీ ఆర్మీ మ్యాన్ గా దేశానికి సేవ చేస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   24 Dec 2025 1:31 PM IST
సినిమాలా.. సైనికుడా.. కళ్యాణ్ పడాల దారెటు..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో టైటిల్ విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల ఒక కామన్ మ్యానే.. ఐతే అతను ఆల్రెడీ ఆర్మీ మ్యాన్ గా దేశానికి సేవ చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనేందుకు అతను లీవ్ పెట్టి మరీ బిగ్ బాస్ అగ్నిపరీక్షకు అప్లై చేయడం.. అక్కడ ఎంపికై బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఏకంగా టైటిల్ విన్నర్ అవ్వడం ఇదంతా కళ్యాణ్ పడాల ఫ్యామిలీకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. కేవలం శ్రీకాకుళంలో ఒక పల్లెటూరికి చెందిన కళ్యాణ్ పడాల తల్లితండ్రులను బిగ్ బాస్ విజేతగా మారి గర్వంగా ప్రపంచానికి పరిచయం చేశాడు కళ్యాణ్.

కళ్యాణ్ పడాల తండ్రి లక్ష్మణ్ రావు..

ఐతే ఆర్మీ మ్యాన్ గా ఉన్న కళ్యాణ్ ఇలా కామనర్ గా వచ్చి బిగ్ బాస్ టైటిల్ గెలవడం బాగున్నా తన డ్యూటీ తాను చేయాల్సి ఉంది. ఇప్పటికే 3 నెలల లీవ్ తీసుకుని హౌస్ లో ఉన్న అతను డిసెంబర్ 26న జమ్మూ వెళ్లి డ్యూటీలో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని కళ్యాణ్ తండ్రి లక్ష్మణ్ రావు వెళ్లడించారు. కళ్యాణ్ టైటిల్ గెలవడంతో అతని పేరెంట్స్ కూడా సెలబ్రిటీస్ అయ్యారు. రీసెంట్ ఇంటర్వ్యూలో కళ్యాణ్ పడాల తండ్రి లక్ష్మణ్ రావు చెబుతూ కళ్యాణ్ మళ్లీ ఆర్మీలోనే జాయిన్ అవుతాడని అన్నారు.

అంతేకాదు తనకు చిన్నప్పటి నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేదని ఏదైనా చేయాలనుకుంటే దాన్ని సాధిస్తాడని అన్నారు. సీజన్ 9 విజేత అయ్యాక కళ్యాణ్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడటం సంతోషంగా ఉందని అన్నారు లక్ష్మణ్ రావు. అంతేకాదు అనాథలను చేరదీసి వాళ్లను చదివించడం అంటే ఇష్టమని కళ్యాణ్ కి కూడా అది చాలా సంతోషాన్ని అందిస్తుందని అన్నారు లక్ష్మణ్ రావు. కళ్యాణ్ గెలిచిన మొత్తంలో కొంత అనాధల చదువుకి ఉపయోగిస్తామని అన్నారు ఆయన.

కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 గెలవడమే కాదు వాళ్ల పేరెంట్స్ ని గెలిపించాడు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూర పల్లెటూరు నుంచి బిగ్ బాస్ విన్నర్ పేరెంట్స్ గా వారికి ఊహించని విధంగా గుర్తింపు తెచ్చాడు. కళ్యాణ్ ఇంటర్వ్యూస్ కోసమే కాదు అతని తండ్రి లక్ష్మణ్ రావు ఇంటర్వ్యూస్ కోసం కూడా ప్రయత్నించడం విశేషం.

లక్ష్మణ్ రావు ఏంటో తెలిసింది ఎప్పుడంటే..

బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ వీక్ లో కళ్యాణ్ పడాల మదర్ హౌస్ లోకి వచ్చారు. ఐతే ఆమె హౌస్ లోకి వచ్చి కప్ తీసుకుని రావాలని చివరి కెప్టెన్ అవ్వాలని అన్నది. అలానే కళ్యాణ్ హౌస్ లో చివరి కెప్టెన్ అవ్వడమే కాదు కప్ గెలిచాడు. ఐతే ఆ వీకెండ్ స్టేజ్ మీదకు వచ్చిన కళ్యాణ్ ఫాదర్ లక్ష్మణ్ రావు సిన్సియారిటీ ఏంటన్నది ఆడియన్స్ కి అర్థమైంది.

మంచి సైడ్ ఉండాలని.. నలుగురికి మేలు చేయాలని మంచి ఫాదర్ కొటేషన్స్ తో అతని మంచితనం చాటుకున్నారు లక్ష్మణ్ రావు ఓ విధంగా కళ్యాణ్ పై ఆడియన్స్ మైండ్ సెట్ మారింది ఆ కామెంట్స్ వల్లే. ఆ తర్వాత అతని ఆట కూడా హెల్ప్ అయ్యి టైటిల్ విజేత అయ్యాడు.

ఇదిలా ఉంటే లక్ష్మణ్ రావు గారేమో కళ్యాణ్ మళ్లీ జవాన్ గానే వెళ్తాడని అంటుంటే కళ్యాణ్ మాత్రం తనకు సినిమాల మీద ఇంట్రెస్ట్ అని అంటున్నాడు. యాక్టర్ అవ్వడం కోసమే అగ్నిపరీక్షకు వచ్చానని చెప్పాడు కళ్యాణ్. టైటిల్ విన్నర్ అయ్యాడు కాబట్టి ఎలాగు సినిమా ఛాన్స్ లు వస్తాయి. కానీ ఆర్మీ జాబ్ వదిలి పూర్తిగా సినిమాలే అంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. మరి ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ ఏం చేస్తాడన్నది చూడాలి.