Begin typing your search above and press return to search.

సంక్రాంతి డైరెక్టర్.. నాలుగేళ్లుగా సినిమా లేదే!

కానీ ఆ ఊపులో రవితేజతో చేసిన నేల టికెట్ దారుణంగా దెబ్బకొట్టింది. ఆ డిజాస్టర్ తో కెరీర్ కు పెద్ద బ్రేక్ పడింది. దానికి తోడు కరోనా పరిస్థితులు ఆ గ్యాప్ ను మరింత పెంచాయి.

By:  M Prashanth   |   8 Oct 2026 5:00 PM IST
సంక్రాంతి డైరెక్టర్.. నాలుగేళ్లుగా సినిమా లేదే!
X

సంక్రాంతి సీజన్ అంటేనే ఇప్పుడు అనిల్ రావిపూడి గుర్తొస్తున్నాడు. కానీ అంతకంటే ముందే పండగ బరిలో దిగి తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. 2016లో సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ దగ్గర పెద్ద మ్యాజిక్ చేశాడు. ఆ వెంటనే నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం తీసి తనలో డిఫరెంట్ ఎమోషన్స్ డీల్ చేసే సత్తా కూడా ఉందని నిరూపించుకున్నాడు.

కానీ ఆ ఊపులో రవితేజతో చేసిన నేల టికెట్ దారుణంగా దెబ్బకొట్టింది. ఆ డిజాస్టర్ తో కెరీర్ కు పెద్ద బ్రేక్ పడింది. దానికి తోడు కరోనా పరిస్థితులు ఆ గ్యాప్ ను మరింత పెంచాయి. ఫైనల్ గా 2022లో నాగార్జున, చైతూ కాంబోలో బంగార్రాజుతో మళ్లీ సంక్రాంతి సీజన్ కే వచ్చి సాలిడ్ హిట్ కొట్టి తన ఫామ్ ఏంటో చూపించాడు. అయితే చేసిన నాలుగు సినిమాల్లో మూడు బంపర్ హిట్లు. బంగార్రాజు లాంటి సక్సెస్ తర్వాత ఆయన చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉండాలి.

కానీ ఆశ్చర్యంగా ఆ సినిమా వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా ఆయన తర్వాతి ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. అలా అని ఆయనకు అవకాశాలు రాలేదంటే అదీ కాదు. 2023లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందనే వార్తలు గట్టిగా వినిపించాయి. కథా చర్చలు కూడా జరిగాయి కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు.

ఆ తర్వాత నాగార్జున, చైతన్య, అఖిల్ తో ఒక భారీ అక్కినేని మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది కూడా కాగితాలకే పరిమితమైంది. అయితే ఇప్పుడు మళ్లీ చిరంజీవి నెక్స్ట్ సినిమాల లిస్ట్ లో కళ్యాణ్ కృష్ణ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో కాకా చేస్తున్న చిరు, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ లేట్ అయ్యేలా ఉండటంతో ఆ ప్లేస్ లోకి బుచ్చిబాబు లేదా కళ్యాణ్ కృష్ణ రావొచ్చనే టాక్ నడుస్తోంది.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. కళ్యాణ్ కృష్ణ కెరీర్ లో వచ్చిన నాలుగు సినిమాల్లో మూడు అక్కినేని కాంపౌండ్ లో చేసినవే. బయట హీరోతో చేసిన ఏకైక సినిమా నేల టికెట్ ప్లాప్ అయింది. ఇప్పుడు గనక చిరంజీవితో ప్రాజెక్ట్ ఓకే అయితే, చాలా ఏళ్ల తర్వాత బయటి స్టార్ హీరోతో ఆయనకు ఒక బంపర్ ఆఫర్ దక్కినట్లే. మరి ఈసారైనా ఈ సంక్రాంతి డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ పడుతుందో లేదో చూడాలి.