Begin typing your search above and press return to search.

రాజిరెడ్డితో రీ ఎంట్రీ.. బాలయ్య ఫోన్

ఇటీవల విడుదల అయిన చాంపియన్ మూవీలో రాజిరెడ్డి పాత్రని పోషించిన నటుడు ఎవరో చాలా మందికి తెలుసో తెలియదో.

By:  Satya P   |   3 Jan 2026 9:18 AM IST
రాజిరెడ్డితో రీ ఎంట్రీ.. బాలయ్య ఫోన్
X

ఇటీవల విడుదల అయిన చాంపియన్ మూవీలో రాజిరెడ్డి పాత్రని పోషించిన నటుడు ఎవరో చాలా మందికి తెలుసో తెలియదో. రాజా రెడ్డిగా తనదైన నటనను చూపించి మంచి మార్కులు వేసుకున్న్న ఆయనఏకంగా

మూడున్నర దశాబ్దాల తరువాత తెలుగు సినీ సీమకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఆయన పేరు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆయనే కళ్యాణ్ చక్రవర్తి. 80 దశకంలో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకున్న నందమూరి వంశీకుడు. అన్న ఎన్టీఆర్ అనుంగు తమ్ముడు త్రివిక్రమరావు పెద్ద కుమారుడుగా సినీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ చక్రవర్తి అప్పట్లో యువ నటులల్లో మంచి క్రేజ్ ఉన్న వారుగా పేరు గడించారు.

వరస హిట్లతో :

తొలి చిత్రం మేనమామతో ఎంట్రీ ఇచ్చినా విడుదల మాత్రం మలి చిత్రం అత్తగారూ స్వాగతం. దిగ్గజ నటి భానుమతితో కలసి ఆ సినిమాలో నటించిన కళ్యాణ్ చక్రవర్తి ఆ హిట్ తో వెనక్కి చూసుకోలేదు. వరసగా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చారు. తనకంటూ ఒక శైలిని అలవాటు చేసుకుని ముందుకు సాగారు అలా తలంబ్రాలు మెగాస్టార్ చిరంజీవితో కలసి లంకేశ్వరుడు వంటి మూవీస్ లో నూ నటించారు. 1990 దాకా సాగిన ఆయన సినీ ప్రయాణం తండ్రి త్రివిక్రమరావు అనారోగ్యంతో ఆగిపోయింది. తండ్రి సేవలో ఆయన ఉంటూ వ్యాపారాలు చూసుకుంటూ సినీ సీమకు పూర్తిగా దూరమైపోయారు.

ఎన్నో విషాదాలు :

ఆయన జీవితంలో ఎన్నో విషాదాలు కూడా ఉన్నాయని తాజాగా యూట్యూబ్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన తండ్రి మరణం తల్లి మరణం తరువాత తన సోదరుడి మరణం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఎదిగి వచ్చిన కుమారుడు కూడా రోడ్డు యాక్సిడెంట్ లో మరణించడంతో తాను పూర్తిగా కృంగిపోయాను అని చెప్పారు. ఇక ఆయన సైతం అనారోగ్యం పాలు అయి ఆరు నెలల పాటు కోమాలో గడిపిన విషాదాన్ని కూడా తలచుకున్నారు.

వారి కోరిక మేరకు :

తమ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న వైజయంతి మూవీస్ నుంచి స్వప్నా దత్ వచ్చి అడగడంతో చాంపియన్ మూవీలో రాజి రెడ్డి పాత్ర పోషించాను అని చెప్పారు. ఆ పాత్ర ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మీదట మంచి పాత్రలు దొరికితే తిరిగి నటిస్తాను అని ఆయన చెప్పడం విశేషం. ఇక తన అన్న బాలయ్య తన నటనను మెచ్చుకుని ఫోన్ చేసి అభినందించారని అలాగే ఎందరి నుంచో ప్రశంసలు వస్తున్నాయని ఆయన చెప్పారు మరో అరేడు ఆఫర్లు ఉన్నా తనకు నచ్చిన సినిమానే చేస్తాను అని ఆయన చెప్పారు.

అన్న గారితోనే :

ఇక బాల నటుడిగా కళ్యాణ్ రాం మనుషుల్లో దేవుడు మూవీలో అన్న ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర పోషించారు. అలా తొలిసారి వెండి తెరకు పరిచయం అయిన ఆయన కాలేజీ చదువు పూర్తి కాగానే నటన మీద పూర్తి దృష్టి పెట్టారు. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతోందని సినిమాల్లో నటించడం అన్నది మంచి పాత్ర దొరికితే అన్న కండిషన్ తోనే అని చెప్పేశారు కళ్యాణ్ చక్రవర్తి.