ప్రత్యామ్నాయం అంత ఈజీ కాదే!
'కల్కి 2' నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణే నిష్క్రమణ ఎంత సంచలనమైందో తెలిసిందే.
By: Srikanth Kontham | 20 Sept 2025 1:00 PM IST`కల్కి 2` నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణే నిష్క్రమణ ఎంత సంచలనమైందో తెలిసిందే. చిత్ర బృందమే దీపికను తొలగించినట్లు అధికారికంగా వెల్లడించింది. దీంతో సుమతి పాత్రని ఇప్పుడే నటితో భర్తీ చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ఈ భర్తీ అన్నది అంత సులభం కాదు. తొలుతు ` కల్కి లో హీరోయిన్ గా ఏ నటిని తీసుకోవాలి అనుకున్న సమయంలోనే టీమ్ ఎన్నో ఆలోచనలు చేసింది. పాన్ ఇండియాలో ఇమేజ్ ఉన్న నటి ఎవరు? సుమతి పాత్రకు అన్ని రకాలు న్యాయం చేసే నటి ఎవరవుతారని ఎన్నో రకాలుగా ఆలోచించింది..ఎంతో మంది బాలీవుడ్ భామల్ని పరిశీలించి చివరు దీపికను ఎంపిక చేసారు.
పీసీకి ఛాన్సు వచ్చినా నో చెబుతుందా:
ఇప్పుడా పాత్రకు కొత్త నటిని తీసుకోవడం అన్నది యూనిట్ కి అంతే సవాల్. మరి ఇప్పుడా పాత్రకు ప్రత్యామ్నాయం ఏంటి? అంటే ప్రియాంక చోప్రాను ఎంపిక చేద్దామన్నా? ఆమె ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎంతో టఫ్ షెడ్యూల్ నడుమే ఎస్ ఎస్ ఎంబీ 29 కమిట్ అయింది. ఇండియాలో ఉండి షూటింగ్ చేస్తున్నా? మనసంతా హాలీ వుడ్ పైనే ఉంది. అక్కడ ప్రాజెక్ట్ ల్లో నటిస్తూ మహేష్ సినిమాను బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉన్నా కమిట్ అవ్వడంతో తప్పలేదు. ఇంత బిజీ షెడ్యూల్ నడుమ `కల్కి 2898`లో పీసీ చేరే అవకాశం ఎంత మాత్రం లేదు.
ఎవరా లక్కీ హీరోయిన్:
కృతిసనన్, కత్రినా కైఫ్ లాంటి వారు ఉన్నా? సుమతి పాత్రకు సెట్ అవ్వరన్నది కొందరి అభిప్రాయం. కొత్త నటిని దించుదామా? సౌత్ హీరోయిన్లను పరిశీలిద్దామన్నా? పాన్ ఇండియా వైడ్ ప్రాజెక్ట్ కాబట్టి వర్కౌట్ అవ్వదు. మార్కెట్ సహా ఇమేజ్ పరంగాను కొంత వరకూ ఏ నటిని ఎంపిక చేసినా ప్రాజెక్ట్ కి కలిసి వచ్చేలా ఉండాలి. అలా చూసుకుంటే బాలీవుడ్ నుంచి ఓ ఇద్దరు భామలు కనిపిస్తున్నారు. అలియాభట్ కి ఆ రేంజ్ ఉంది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు బాగా సుపరిచిమైన నటి. తెలుగింట సీతమ్మగా ఒక్క సినిమాతోనే రీచ్ అయింది. బాక్సాఫీస్ వద్ద సోలోగానూ సత్తా చాటిన అనుభవం ఉంది.
ఛాన్స్ వాళ్లకే ఉందా:
అలాగే అనుష్క శర్మ కూడా వర్కౌట్ అవుతుంది. విరాట్ కోహ్లీ భార్య కాబట్టి అనుష్క కు వరల్డ్ వైడ్ పాపులార్టీ ఉంది. ఆ ఇమేజ్ సినిమాకు బాగా కలిసొస్తుంది. మార్కెట్ పరంగా మంచి బిజినెస్ అవుతుంది. కరీనా కపూర్ కూడా ప్రభాస్ సరసన పర్పెక్ట్ గా సెట్ అవుతుంది. ప్రభాస్ ఏజ్ ని పర్పెక్ట్ గా మ్యాచ్ చేస్తుంది. అనుష్క శెట్టి ప్రభాస్ కి జోడీగా సెట్ అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్కౌట్ అవ్వదు. అమ్మడి రూపంలో కొన్ని రకాల మార్పుల నేపథ్యంలో ఆమెని ఎంపిక చేస్తే రిస్క్ తీసుకున్నట్లే అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సుమతి పాత్రను ఏ నటితో భర్తీ చేస్తారన్నది చూడాలి.
