దీపికకు దిమ్మ తిరిగేలా పీసీని దించుతున్నారా?
మొత్తంగా దీపిక- కల్కి నిర్మాతల మధ్య సీరియస్ డిస్కషన్ అయితే జరిగిందన్నది కొంత వరకూ వాస్తవంగా భావించొచ్చు.
By: Srikanth Kontham | 4 Dec 2025 12:57 PM IST'కల్కీ 2' నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణే నిష్క్రమించిన వైనం తెలిసిందే. అందుకు గల కారణాలు ఏంటి అంటే? 25 శాతం అధిక పారితోషికం డిమాండ్ చేయడం, పని గంటల విషయంలో మేకర్స్ తో ఒప్పందం కుదరకపోవడం...రోజుకు కేవలం ఏడు గంటలు మాత్రమే పని చేస్తాను వంటి కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రతిగా నిర్మాతల నుంచి అంతే ధీటుగా సమాధానం వచ్చింది. ఇలాంటి సినిమాలో నటించాలంటే ఎంతో కమిట్ మెంట్ ఉండాలని నిర్మాణ సంస్థ నుంచి ఓ పోస్ట్ కూడా నెట్టింట వైరల్ అయింది.
స్వీటీ కంటే పీసీ బెటర్:
మొత్తంగా దీపిక- కల్కి నిర్మాతల మధ్య సీరియస్ డిస్కషన్ అయితే జరిగిందన్నది కొంత వరకూ వాస్తవంగా భావించొచ్చు. దీపిక ఎగ్జిట్ అనంతరం ఆ స్థానంలోకి స్వీటీ అనుష్కను తెస్తున్నట్లు అంతే బలంగా ప్రచారం జరిగింది. మేకర్స్ ఎంత మంది బాలీవుడ్ భామల్ని పరిశీలించినా? ఎవరూ సరితూగకపోవడంతో అనుష్క మాత్రమే పర్పెక్ట్ ఛాయిస్ గా నెట్టింట ప్రచారం జోరందుకుంది. మేకర్స్ కూడా ఆప్షన్ లేనట్లుగా భావిస్తున్నట్లు మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కించాయి. ఈ నేపథ్యంలో దీపిక పదుకొణే, అనుష్క కంటే ఉత్తమ నటి వైపు చూస్తున్నట్లు తాజాగా మరో కొత్త ప్రచారం మొదలైంది.
వారణాసిలోకి ఎంటర్ అవ్వడంతోనే:
'వారణాసి' చిత్రంతో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'కల్కి' దర్శకుడి దృష్టి పీసీ వైపు పడినట్లు వార్తలొస్తున్నాయి. అంతే కాదు పీసీ ఎంపికతో? దీపికకు సరైన కౌంటర్ కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక చోప్రాను తీసుకుంటే? సినిమాకు అంతర్జాతీయ మార్కెట్ పరంగా కలిసొస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. హాలీవుడ్ సినిమాలతో పీసీ ఇంటర్నేషనల్ మార్కెట్ కి ఇప్పటికే రీచ్ అయింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి `వారణాసి`కి ఎంపిక చేసాడు.
ప్రియాంక చోప్రా వైపే చూస్తున్నారా:
ప్రస్తుతం పీసీతో జక్కన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసుకుంటున్నాడు. జక్కన్న మాటకు కట్టుబడి పీసీ పని చేస్తుంది. చెప్పిన టైమ్ కి షూటింగ్ కి వస్తుంది. షూటింగ్ కాస్త ఆలస్యమైనా అడ్జస్ట్ అవుతుంది. అలాగే పీసీ కూడా ఎక్కడా పనిగంటల గురించి మాట్లాడలేదు. అగ్రిమెంట్ ప్రకారం పారితోషికం తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు టీమ్ తో మింగిల్ అవుతుంది. ఇవన్నీ గమనించిన `కల్కి` మేకర్స్ లో ప్రియాంకను మించిన ఉత్తమ నటి ఎవరుంటారు? అన్న ఆలోచన మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది. `కల్కీ 2` కంటే ముందుగా `వారణిసి` రిలీజ్ అవుతుంది. ప్రియాంకను తీసుకుంటే గనుక ఆ హిట్ `కల్కి 2` కి కలిసొస్తుంది. మార్కెట్ పరంగానూ మరింత మెరుగ్గా ఉంటుంది. మరి ఛాన్స్ ఎవరికిస్తారు? అన్నది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకూ క్లారిటీ లేనట్లే.
