Begin typing your search above and press return to search.

కల్కి 2 అప్‌డేట్.. నాగ్ అశ్విన్ సైలెంట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

అయితే ఈ ఈవెంట్‌లో అందరి దృష్టి ‘సింగ్ గీతం’ మీద కంటే ఎక్కువగా ప్రభాస్ నెక్స్ట్ రాబోయే ‘కల్కి 2’ అప్‌డేట్ మీదే ఉంది.

By:  M Prashanth   |   17 May 2026 11:33 AM IST
కల్కి 2 అప్‌డేట్.. నాగ్ అశ్విన్ సైలెంట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
X

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టాప్ డైరెక్టర్ అయినా అతను నవ్వుకుంటూ వేసే సెటైర్లు మాములుగా ఉండవు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వస్తున్న ‘సింగ్ గీతం’ సినిమా ప్రెస్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నాగ్ అశ్విన్ స్వయంగా నిర్మిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సింగీతం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాను జూన్ 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ ఈవెంట్‌లో అందరి దృష్టి ‘సింగ్ గీతం’ మీద కంటే ఎక్కువగా ప్రభాస్ నెక్స్ట్ రాబోయే ‘కల్కి 2’ అప్‌డేట్ మీదే ఉంది. ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు కల్కి పార్ట్ 2 గురించి అడగగా నాగ్ అశ్విన్ సరదాగా మ్యాటర్ ని మార్చేశారు. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉందని, నాయిస్ వల్ల సరిగ్గా వినిపించడం లేదంటూ నవ్వుతూ టాపిక్ డైవర్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కల్కి 2 గురించి ఇప్పుడే ఎలాంటి విషయాలు బయట పెట్టకూడదని ఆయన గట్టిగా ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది.

మొదటి భాగం భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ మీద భారీగా హైప్ ఉంది. కానీ దానికి సంబంధించిన వర్క్ ఎంతవరకు వచ్చింది, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే సస్పెన్స్ మాత్రం వీడలేదు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ సినిమాతో పాటు, హను రాఘవపూడి ‘ఫౌజీ’ షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు. ఈ రెండు భారీ చిత్రాల పనుల్లో ప్రభాస్ బిజీగా ఉండటం వల్లే కల్కి 2 అప్‌డేట్లను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారనే ప్రచారం సాగుతోంది.

ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ఇంకొక సినిమా గురించి మాట్లాడితే ‘సింగ్ గీతం’ ప్రాజెక్ట్ డీవియేట్ అవుతుందనే ఆలోచన కూడా నాగ్ అశ్విన్ లో ఉండి ఉండవచ్చు. నిజానికి కల్కి లాంటి భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ చాలా అవసరం. పార్ట్ 2 స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కావడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా పక్కా ప్లానింగ్ సెట్ అయ్యాకే అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ డేట్స్ కూడా అడ్జస్ట్ అవ్వాల్సి ఉండటంతో ఈ గ్యాప్ లో నాగ్ అశ్విన్ తన ప్రొడక్షన్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. 90 ఏళ్ల వయసులో కూడా సింగీతం గారు చేస్తున్న ఈ సినిమాను సపోర్ట్ చేయడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఇక కల్కి 2 కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి నాగ్ అశ్విన్ సైలెన్స్ కొంత నిరాశ కలిగించినా, అది సినిమా మంచి కోసమేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సరైన టైమ్ చూసి ఒకేసారి పెద్ద సర్ ప్రైజ్ ఇవ్వాలనేది దర్శకుడి ప్లాన్ కావచ్చు. ప్రభాస్ తన ప్రెజెంట్ సినిమాలు పూర్తి చేశాకే కల్కి వరల్డ్ లోకి మళ్ళీ అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎలాంటి చిన్న లీక్ కూడా రాకుండా మేకర్స్ చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ పడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.