కల్కి : రెండున్నర ఏళ్లకు గుడ్ న్యూస్
కల్కి సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన దీపికా పదుకునే తప్పుకుందనే విషయం తెల్సిందే. ఆమె తప్పుకోవడంతో ఆ పాత్రను ఎవరు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
By: Ramesh Palla | 16 Oct 2026 8:00 PM ISTప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి' కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సాంకేతిక పరంగా సినిమా మంచి స్పందన దక్కించుకుంది. అందుకే మొదటి పార్ట్ విడుదలైన రెండో రోజు నుంచే సీక్వెల్ గురించి ఎదురు చూపులు మొదలు అయ్యాయి. కల్కి మొదటి పార్ట్ అత్యంత ఆసక్తికరమైన పాయింట్ వద్ద పూర్తి అయిన విషయం తెల్సిందే. దేవుడి పుట్టుక రెండో పార్ట్‌లో ఉంటుంది. దేవుడి పుట్టిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, మహాభారత ఘట్టాలతో కలిపి కల్కి 2 సినిమా ఉంటుందని మొదటి నుంచి చాలా మంది ఊహిస్తూ వస్తున్నారు. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ అంతకు మించే ఉంటుందని సన్నిహితుల వద్ద అంటున్నాడట. దాంతో కల్కి 2 పై అంచనాలు మరింతగా పెరిగాయి. సీక్వెల్ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
కల్కి నుంచి దీపికా పదుకునే ఔట్...
కల్కి సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన దీపికా పదుకునే తప్పుకుందనే విషయం తెల్సిందే. ఆమె తప్పుకోవడంతో ఆ పాత్రను ఎవరు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మొదటి పార్ట్ షూటింగ్ సమయంలోనే సెకండ్ పార్ట్ దాదాపు సగం షూట్ పూర్తి చేశారనే వార్తలు వచ్చాయి. దాంతో దీపికా పాత్ర విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం చేస్తాడా అనే ఆసక్తి నెలకొంది. అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారని తెలుస్తోంది. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే రెండు మూడు రోజులు ఆయనతో చేసే అవకాశాలు ఉన్నాయి. కమల్ హాసన్ సైతం ఈ పార్ట్ లో కీలక రోల్లో కనిపిస్తాడని అంటున్నారు. కనుక ఆయన పార్ట్ షూటింగ్ ఎంత వరకు అయింది అనేది తెలియాల్సి ఉంది. గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న కల్కి 2 షూటింగ్ ప్రారంభంకు సంబంధించిన కీలక అప్డేట్ అతి త్వరలో యూనిట్ సభ్యుల నుంచి రాబోతుందట.
కల్కి 2 షూటింగ్ ప్రారంభం కోసం...
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కల్కి 2 షూటింగ్‌ను నవంబర్‌లో ప్రారంభించబోతున్నారు. ప్రభాస్ ఫౌజీతో పాటు స్పిరిట్‌కు సంబంధించిన షూటింగ్స్ తో గత ఏడాది కాలంగా బిజీ బిజీగా ఉన్న కారణంగా కల్కి 2 కి డేట్లు ఇవ్వలేక పోయాడట. ఫైనల్‌గా వచ్చే నెల నుంచి డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. దాంతో నాగ్ అశ్విన్ షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందుతో పోల్చితే ఈసారి మరింత భారీగా కొన్ని సెట్స్ ను వేయాల్సి ఉందట. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మొదటి పార్ట్‌కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో కొన్ని కొత్త సీన్స్ సైతం యాడ్ చేసే ప్లాన్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్నాడు. మొత్తానికి కల్కి 2 షూటింగ్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇదో పెద్ద గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కల్కి 2....
రెండున్నర ఏళ్ల తర్వాత మళ్లీ కల్కి సెట్స్ లో యూనిట్ అడుగు పెట్టబోతుంది. ప్రేక్షకుల ఎదురుచూపులకు తెర పడుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న కల్కి 2 సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2028 ఆరంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఏడాది పాటు మేకింగ్ ఉంటుందని, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం సమాంతరంగా నిర్వహిస్తూ వచ్చే ఏడాది చివరి వరకు అన్ని పనులు పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్లు చెబుతున్నారు. మొన్నటి వరకు అనుకున్నట్లుగా వచ్చే ఏడాదిలో కల్కి 2 సినిమా విడుదల సాధ్యం కాదని తేలిపోయింది. 2028 వరకు సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. వెంటనే రాకున్నా ఒకవైపు షూటింగ్ జరుగుతుంది అంటే కచ్చితంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కనుక కల్కి 2ను ప్రారంభించడం అనేది అభిమానులకు పెద్ద పండుగ న్యూస్ అనడంలో సందేహం లేదు. మరి దసరాకు ఆ వార్తను ఫ్యాన్స్ కి నాగ్ అశ్విన్ అండ్ టీం వినిపించేనా చూడాలి.
