Begin typing your search above and press return to search.

'క‌ల్కీ 2'కి ముహూర్తం పెట్టేసారా?

ఒకేసారి రెండు..మూడు ప్రాజెక్ట్ లు ప‌ట్టాలెక్కించడం ప్ర‌భాస్ ప్ర‌త్యేక‌త‌. ఏక కాలంలో వాటి షూటింగ్స్ లో పాల్గొన‌డం లోనూ డార్లింగ్ అంతే ఘ‌నుడు.

By:  Srikanth Kontham   |   13 Jan 2026 4:00 PM IST
క‌ల్కీ 2కి ముహూర్తం పెట్టేసారా?
X

ఒకేసారి రెండు..మూడు ప్రాజెక్ట్ లు ప‌ట్టాలెక్కించడం ప్ర‌భాస్ ప్ర‌త్యేక‌త‌. ఏక కాలంలో వాటి షూటింగ్స్ లో పాల్గొన‌డం లోనూ డార్లింగ్ అంతే ఘ‌నుడు. గత ఏడాది `రాసాజాబ్`, `పౌజీ` షూటింగ్ ల‌తో బిజీగా గ‌డిపాడు. ఎట్ట‌కేల‌కు రాజాసాబ్ అన్ని అవాంత‌రాలు దాటుకుని 9న రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న బెడితే? ప్ర‌భాస్ మెరుపు వేగంగా షూటింగ్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లున్నాయి. ఇప్ప‌టికే `పౌజీ` షూటింగ్ చాలా వ‌ర‌కూ పూర్త‌యింది. భారీ పీరియాడిక్ చిత్రం కావ‌డంతో? రాజాసాబ్ ని ప‌క్క‌న‌బెట్టి మ‌రీ `పౌజీ` షూటింగ్ కి హాజ‌ర‌య్యాడు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ `స్పిరిట్` ని ప‌ట్టాలెక్కించాడు. `రాజాసాబ్` ప్ర‌చారం అనంత‌రం డార్లింగ్ విదేశాల‌కు వెకేష‌న్ కు వెళ్లాడు. మ‌రో రెండు..మూడు రోజుల్లో తిరిగి రానున్నాడు. సంక్రాంతి సెల‌వుల అనంత‌రం తిరిగి `స్పిరిట్` షూటింగ్ లో పాల్గొంటాడు. ప్ర‌స్తుతం సందీప్ ప్ర‌భాస్ లేని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే `క‌ల్కి 2` అప్ డేట్ కూడా తెర‌పైకి వ‌స్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్ర‌వ‌రి ముగింపు లేదా మార్చి తొలి వారంలో మొద‌లు పెట్టాల‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నాడుట‌.

ప్ర‌భాస్ లేకుండానే షూట్ ప్లాన్ చేస్తున్నారుట‌. ప్ర‌భాస్ `కల్కి 2` లో జాయిన్ అవ్వ‌డానికి మ‌రో రెండు మూడు నెల‌లైనా స‌మ‌యం ప‌డుతుందని స‌మాచారం. ఈలోగా ప్ర‌భాస్ లేని స‌న్నివేశాలు పూర్తి చేయాల‌న్ని నాగీ ప్లాన్ కావొచ్చు. ఇలా చేయ‌గ‌లిగితే స‌మ‌యం చాలా వ‌ర‌కూ క‌లిసొస్తుంది. ప్ర‌భాస్ వ‌చ్చిన త‌ర్వాతే అన్ని ప‌నులు ఒకేసారి చేయ‌డం కంటే? ముందుగానే మొద‌లు పెట్టి ప్ర‌భాస్ లేని ప్ర‌ధాన న‌టుల‌పై కీల‌క స‌న్నివేశాలు పూర్తి చేయోచ్చు. `స్పిరిట్` షూటింగ్ కూడా సందీప్ రెడ్డి వేగంగానే పూర్తి చేస్తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

90 లేదా 120 రోజుల్లోనే `స్పిరిట్` షూటింగ్ పూర్తి చేయాల‌ని సందీప్ ముందుకెళ్తున్నాడు. ఈనేప‌థ్యంలోనే నాగీ `క‌ల్కి 2` తెర‌పైకి తెస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. `పౌజీ` షూటింగ్ కోసం ప్ర‌భాస్ ఎన్ని రోజులు కేటాయించాల్సి ఉంటుంది? అన్న దానిపై ఓ క్లారిటీ వ‌స్తే మిగ‌తా షూటింగ్ డేస్ పై మేక‌ర్స్ ఓ అంచ‌నాకి రావొచ్చు. రాజాసాబ్ కోసం లుక్ లో మార్పులు తెచ్చినా? మ‌ళ్లీ పాత లుక్ లోకి వెళ్లిపోయాడని రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పిక్స్ తో తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో `పౌజీ`, `స్పిరిట్`, `క‌ల్కి 2` కోసం లుక్ ప‌రంగా పెద్ద‌గా ఛేంజ‌స్ కూడా లేన‌ట్లే క‌నిపిస్తోంది. అలాంటి మార్పులుంటే ఒకేసారి మూడు సినిమా షూటింగ్ లు పూర్తి చేయ‌డం అసాధ్య‌మే.