Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'కల్కి 2'.. నాగి రిలీజ్ టార్గెట్ అదేనా..

కల్కి 2898 ఏడీ మూవీతో ఇండియన్ సినిమాకు కొత్త స్కేల్ చూపించిన టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇప్పుడు సీక్వెల్ విషయంలోనూ అదే రేంజ్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

By:  M Prashanth   |   24 Sept 2026 12:00 PM IST
ప్రభాస్ కల్కి 2.. నాగి రిలీజ్ టార్గెట్ అదేనా..
X

కల్కి 2898 ఏడీ మూవీతో ఇండియన్ సినిమాకు కొత్త స్కేల్ చూపించిన టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇప్పుడు సీక్వెల్ విషయంలోనూ అదే రేంజ్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. షూటింగ్ ఎప్పుడు స్టార్టింగ్.. ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే దానికంటే.. అసలు కల్కి 2 థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు కథను కూడా ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ దగ్గర ఆపేశారు. ప్రభాస్ పాత్రకు కర్ణుడి లింక్, కమల్ హాసన్ పోషించిన యాస్కిన్ రోల్ లోని కొత్త యాంగిల్.. ఇవన్నీ రెండో పార్టుపై అంచనాలు మరింత పెంచాయి.

ఇప్పుడు ఆ సినిమా పనుల విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ పెట్టుకున్న టైమ్‌ లైన్ చర్చనీయాంశంగా మారింది. కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 2026 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన షూట్ జరిగినా.. మెయిన్ షూటింగ్ మాత్రం ముందుంది. అయితే షూటింగ్‌ ను 2027 మధ్య నాటికి పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అంటే ఆ తర్వాత సినిమా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కల్కి వరల్డ్ కు గ్రాఫిక్స్, సీజీఐ చాలా కీలకం కావడంతో.. ఆ పనులకు కూడా ఎక్కువ సమయం అవసరం కానుంది. ఇక్కడే 2027 రిలీజ్ టార్గెట్ వినిపిస్తోంది. షూటింగ్‌ ను 2027 మధ్యలో ముగించి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి అదే ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మూవీ టీమ్ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా డిసెంబర్ 2027ను టార్గెట్‌గా పెట్టుకున్నారనే చర్చ ఇప్పుడు వినిపిస్తోంది. క్రిస్మస్ సీజన్ లేదా డిసెంబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇది ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ కాదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలా సాగుతాయనే దానిపై ఫైనల్ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. మరోవైపు ప్రభాస్ చేతిలో ఉన్న ఇతర సినిమాల డేట్స్ కూడా కల్కి 2 రిలీజ్‌ పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది.

స్పిరిట్, ఫౌజీ వంటి ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీగా ఉండటంతో డేట్స్‌ ను కూడా నాగ్ అశ్విన్ టీమ్ పక్కాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా అనుకున్నట్లే సినిమా రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాలి మరి.