Begin typing your search above and press return to search.

దీపికాకి రీప్లేస్ మెంట్.. ఇప్పుడు అసలు సినిమా మొదలైంది..?

కల్కి 1 సినిమాకు దీపికాకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఐతే కొన్ని కారణాల వల్ల కల్కి 2 నుంచి దీపికాని తీసేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.

By:  Ramesh Boddu   |   11 Oct 2025 11:40 AM IST
దీపికాకి రీప్లేస్ మెంట్.. ఇప్పుడు అసలు సినిమా మొదలైంది..?
X

వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 AD సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. కల్కి సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేయగా అందులో కల్కి 2898 ఏడి మొదటి భాగంగా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కి నాగ్ అశ్విన్ ఆల్రెడీ స్టోరీ సిద్ధం చేసినా ప్రభాస్ ఇంకా మిగతా వారి డేట్స్ కోసం వెయిట్ చేయక తప్పట్లేదు. కల్కి 2898 AD లో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె నటించారు. సినిమాలో అశ్వద్ధామ రోల్ లో అమితాబ్ అదరగొట్టారు. ఇక సుమతి పాత్రలో దీపికా కూడా ఇంప్రెస్ చేసింది.

దీపికా పదుకొనె కాల్ షీట్ విషయంలో..

కల్కి 1 సినిమాకు దీపికాకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఐతే కొన్ని కారణాల వల్ల కల్కి 2 నుంచి దీపికాని తీసేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆమె వర్కింగ్ కండీషన్స్ వల్ల సినిమా నుంచి తప్పించినట్టు తెలుస్తుంది. ఐతే దీపికా పదుకొనె కాల్ షీట్ విషయంలో జరుగుతున్న హంగామా తెలిసిందే. ఇదిలా ఉంటే కల్కి 2 సినిమాలో దీపికాకి రీప్లేస్ మెంట్ ఎవరు అన్నది స్పెషల్ డిస్కషన్ పాయింట్ అయ్యింది.

కల్కి 2 సినిమాలో దీపికాకి బదులుగా మరో బాలీవుడ్ హీరోయిన్ నే తీసుకోవాలని నాగ్ అశ్విన్ ఫిక్స్ అయ్యాడట. అది కూడా దీపికా రేంజ్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ ని పిక్ చేసుకుంటున్నారట. ముంబై మీడియా వర్గాల డిస్కషన్స్ ను బట్టి అలియా భట్ కి కల్కి 2 ఆఫర్ వచ్చిందని అంటున్నారు. దీపికాకు కచ్చితంగా అలియా భట్ రీప్లేస్ మెంట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే దీపికా స్టార్ ఇమేజ్, అలియా స్టార్ ఇమేజ్ గురించి పక్కన పెడితే.. ఒక పాత్రకు దీపికా ఎలాగైతే తన బెస్ట్ ఇస్తుందో.. అలియా భట్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది.

తెలుగు ఆడియన్స్ ప్రేమను ఇష్టపడుతుంది..

అదీగాక క్రేజ్ విషయంలో ఇద్దరికీ ఈక్వెల్ రేంజ్ ఉంది. దీపికా కాస్త సీనియర్ కాబట్టి ఆమెపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇక అలియా భట్ విషయానికి వస్తే ఆల్రెడీ తెలుగులో ఆర్.ఆర్.ఆర్ కి చేసింది. తెలుగు ఆడియన్స్ ప్రేమను అలియా భట్ చాలా ఇష్టపడుతుంది. సో దీపికా ప్లేస్ లో అలియా భట్ ఎంపిక కచ్చితంగా బెటర్ అనిపిస్తుంది.

ఐతే ఇది ఫైనల్ అవుతుందా లేదా నాగ్ అశ్విన్ మరో హీరోయిన్ ని ఎవరినైనా చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది. దీపికా ప్లేస్ లో అలియా భట్ ని తీసుకుంటే మాత్రం మన దగ్గర ఏమో కానీ బాలీవుడ్ లో మాత్రం ఆ ఇద్దరి ఫ్యాన్స్ ఇంకా సపోర్టర్స్ మధ్య ఫైట్ షురూ అవుతుంది. సో కల్కి 2లో అలియా ఎంటర్ అయితే అప్పుడు మొదలవుతుంది అసలు సినిమా అని చెప్పొచ్చు.