Begin typing your search above and press return to search.

యాటిట్యూడ్ హీరోస్.. నిర్మాత టార్గెట్ ఎవరు..?

ఐతే ఈ ఈవెంట్ లో నిర్మాత కళానిధి మారన్ కొందరు హీరోల మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

By:  Ramesh Boddu   |   3 Aug 2025 11:51 AM IST
యాటిట్యూడ్ హీరోస్.. నిర్మాత టార్గెట్ ఎవరు..?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆగష్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఫిమేల్ లీడ్ గా నటించింది. ఇక ఈ మూవీలో పూజా హెగ్దే ఒక స్పెషల్ సాంగ్ చేసింది. అనిరుద్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో భారీగా జరిగింది.

హీరోల మీద సెన్సేషనల్ కామెంట్స్..

ఐతే ఈ ఈవెంట్ లో నిర్మాత కళానిధి మారన్ కొందరు హీరోల మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈరోజుల్లో కొందరు సక్సెస్ ఫుల్ యాక్టర్స్ యాటిట్యూడ్ చూపిస్తున్నారని అన్నారు. రెండు హిట్లు పడగానే కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా లేదని అన్నారు. అంతేకాదు కొంతమంది అయితే ప్రైవేట్ జెట్స్ కూడా అడుగుతున్నారని అన్నారు. ఐతే సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని ఆయన ఈ దేశంలో ఉన్న ఒకే ఒక్క సూపర్ స్టార్ అని అన్నారు కళానిధి మారన్.

తమిళ పరిశ్రమలో భారీ సినిమాలు చేస్తూ వస్తున్న కళానిధి మారన్ కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. సన్ నెట్ వర్క్ ఈ స్థాయిలో ఉంది అంటే అది ఆయన ప్రతిభ వల్లే అని తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఇప్పటికే రజినీతో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొడుతున్నారు కళానిధి మారన్. ఐతే లేటేస్ట్ గా కూలీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కి రెడీ అవుతున్నారు.

సూపర్ స్టార్ కూలీ సినిమాపై ఫ్యాన్స్ ..

ఐతే కళానిధి మారన్ చెప్పిన హీరోలు ఎవరు.. ఆయన్ను అంతగా విసిగించిన యంగ్ హీరోలు, సక్సెస్ ఫుల్ స్టార్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ లాంటి వాళ్లే నిర్మాత మేలు కోరుతున్నప్పుడు సక్సెస్ ఇప్పుడిప్పుడే వస్తున్న వారు నిర్మాత పరిస్థితులను ఇంకాస్త అర్ధం చేసుకోవాలి. మరి కళానిధి మారన్ ఎవరి వల్ల డిజప్పాయింట్ అయ్యాడో కానీ ఆయన చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సూపర్ స్టార్ కూలీ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు.