స్ట్రీమింగ్ కి సిద్ధమైన ది: ట్రయల్ సీజన్ 2.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ పదహారేళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అందం, అభినయంతో, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Madhu Reddy | 7 Aug 2025 1:13 PM ISTబాలీవుడ్ బ్యూటీ కాజోల్ పదహారేళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అందం, అభినయంతో, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్లో షారుక్ ఖాన్ తో కలిసి పలు చిత్రాలు చేసింది. అంతేకాదు కాజోల్ - షారుక్ ఖాన్ జంట బెస్ట్ హిట్ పెయిర్ గా కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలు, సీరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కాజోల్ ఇప్పుడు మరో సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాజోల్ నటించిన 'ది ట్రయల్' 2వ సీజన్ త్వరలోనే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే 'ది ట్రయల్' పేరుతో వచ్చిన ఫస్ట్ సీజన్ లో కాజోల్ నొయోనికా సేన్ గుప్తా అనే లాయర్ పాత్రలో అలరించింది. అయితే మొదటి సీజన్ అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ సీజన్ 2 పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. మరి ది ట్రయల్ సీజన్-2 వెబ్ సిరీస్ ఎప్పటినుండి జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి రాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన 'ది ట్రయల్ సీజన్ 1' కి కొనసాగింపుగా 'ది ట్రయల్:ప్యార్ కానూన్ దోఖా సీజన్ 2' త్వరలోనే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే 'ది ట్రయల్' వెబ్ సిరీస్ ను 'ది గుడ్ వైఫ్' అనే అమెరికన్ వెబ్ సిరీస్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో హౌస్ వైఫ్ గా ఉన్న కాజోల్ తన భర్త సమస్యల్లో ఇరుక్కుపోయినప్పుడు న్యాయవాదిగా మారి ఎలా తన భర్తని బయటకు తీసుకువస్తుంది అనేది చూపించారు.
అయితే ది ట్రయల్ సీజన్ -2 లో మాత్రం కాజోల్ పాత్ర మరింత బలంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
ది ట్రయల్ 2 సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా.. కాజోల్ "కోర్టు గది అనేది యుద్ధ భూములలో ఒకటి" అంటూ పోస్ట్ పెట్టి ది ట్రయల్ సీజన్ -2 పై భారీ అంచనాలు పెంచేసింది. ది ట్రయల్ సీజన్ 2 సిరీస్ సెప్టెంబర్ 19 నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. సీజన్ 2 లో కాజోల్ వ్యక్తిగత జీవితంలో మరిన్ని సవాళ్లను ఎదుర్కొవడాన్ని చూపిస్తారని తెలుస్తోంది.ఈ వెబ్ సిరీస్ లో అలీ ఖాన్, కరణ్ వీర్ శర్మ, గౌరవ్ పాండే, సోనాలి కులకర్ణి, జిషు సేన్ గుప్తా, కోబ్రా సైట్, షీబా చద్దా తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్న ఈ సీజన్ 2 సిరీస్ ని ఉమేష్ బిస్ట్ దర్శకత్వం వహించగా.. బనిజయ్ ఆసియా నిర్మించారు.
