Begin typing your search above and press return to search.

దుర్గా పూజ‌లో సీనియ‌ర్ న‌టి చేయి ప‌ట్టుకుని షాకిచ్చాడు!

పండుగ అంతా సంబ‌రంగా క‌నిపించింది కానీ, ఓ ఫ్రేమ్‌లో కాజోల్ ఊహించ‌ని విధంగా క‌ళ్లు పెద్ద‌వి చేసి చూస్తూ క‌నిపించింది.

By:  Sivaji Kontham   |   3 Oct 2025 6:49 PM IST
దుర్గా పూజ‌లో సీనియ‌ర్ న‌టి చేయి ప‌ట్టుకుని షాకిచ్చాడు!
X

ఓవైపు దుర్గా పండ‌ల్ ఉత్స‌వాలు ముంబైలో హోరెత్తుతున్నాయి. ద‌స‌రా సంద‌ర్భంగా సెల‌బ్రిటీలంతా చాలా ఉత్సాహంగా దుర్గా మాత చెంత కొలువు దీరి పూజ‌లాచ‌రించారు. సీనియ‌ర్ న‌టి కాజోల్ ప్ర‌త్యేకంగా నిర్వ‌హించిన దుర్గామాత పూజ‌లో బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా కొలువు దీరారు. కానీ ఇంత‌లోనే.. ఒక ట్విస్టు!

ఈ వేడుక‌లో అజ‌య్ దేవ‌గ‌న్- కాజోల్ కుటుంబం నుంచి నైసా దేవ‌గ‌న్, డానిష్ దేవగన్‌, అమన్ దేవగన్ పాల్గొని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ను తెచ్చారు. వేదిక వ‌ద్ద‌ కాజోల్ కుమార్తె నైసా, అజ‌య్ మేన‌ల్లుడు అమ‌న్ జంట‌గా క‌లిసి ఫోజులిచ్చారు. దేవ‌గ‌న్ కుటుంబ స‌భ్యులంతా పైజామా, కుర్తాలు ధ‌రించి పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తెచ్చారు.

ఆకుపచ్చ చీరలో కాజోల్ ప్రత్యేకంగా క‌నిపించింది.

ఇదే వేడుక‌ల్లో రాణి ముఖర్జీ, తనీషా ముఖర్జీ, అయాన్ ముఖర్జీ, రూపాలి గంగూలీ, హృతిక్ రోషన్, కరణ్ జోహార్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అందరూ పండుగ స్ఫూర్తితో ఓచోటికి చేరారు. వారంతా మాతా ఆశీస్సుల‌ను అందుకుని ఉత్సాహంగా క‌నిపించారు. అదే స‌మ‌యంలో అతిథుల‌ను రిసీవ్ చేసుకుంటూ సీనియ‌ర్ న‌టి కాజోల్ చాలా ఉత్సాహంగా క‌నిపించారు.

పండుగ అంతా సంబ‌రంగా క‌నిపించింది కానీ, ఓ ఫ్రేమ్‌లో కాజోల్ ఊహించ‌ని విధంగా క‌ళ్లు పెద్ద‌వి చేసి చూస్తూ క‌నిపించింది. న‌టి కాజోల్ దుర్గా మాత వ‌ద్ద నుంచి మెట్ల మీదుగా కిందికి దిగి వ‌స్తుంటే, అక్క‌డే ఉన్న ఒక వ్య‌క్తి త‌న చేతిని అడ్డుగా పెట్టాడు. అత‌డి చేతిని త‌ప్పించ‌బోయిన కాజోల్ ని అత‌డు పైకి బ‌లంగా గుంజాడు. నిజానికి అది ఊహించ‌నిది. కాజోల్ ఎంతో ఆశ్చ‌ర్య‌పోతూ, వ్వాట్! అంటూ అత‌డిని ప్ర‌శ్నించింది. పండుగ‌లో అత‌డు కాజోల్ ని నిజంగా అప్ర‌య‌త్నంగానే ఇబ్బంది పెట్టాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారుతోంది. అయితే కాజోల్ ఇన్వ‌యిట్ చేసిన ఆ ప్ర‌త్యేక అతిథి ఎవ‌రో అర్థం కావ‌డం లేదు.