అందం కోసం ఆపరేషన్.. స్పందించిన హీరోయిన్
హీరోయిన్స్ అందం పెంచుకోవడం కోసం కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవడం అనేది చాలా కామన్ విషయం.
By: Ramesh Palla | 30 July 2025 3:13 PM ISTహీరోయిన్స్ అందం పెంచుకోవడం కోసం కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవడం అనేది చాలా కామన్ విషయం. అప్పటి తరం హీరోయిన్స్ నుంచి మొదలుకుని ఇప్పటి తరం హీరోయిన్స్ వరకు ఎంతో మంది రహస్యంగా లేదంటే ఓపెన్‌గానే కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నారు. రహస్యంగా ఉంచినా వారి రూపం ఆ విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉంటుంది. చాలా మంది హీరోయిన్స్ సర్జరీతో అందం పెంచుకున్న వాళ్లు ఉన్నారు. అయితే అందులో ఎక్కువ శాతం మంది సర్జరీ చేయించుకున్న విషయాన్ని ఒప్పుకునేందుకు ఆసక్తిగా ఉండరు. అసలు కొందరు ఆ విషయం గురించి మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించరు. అలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో కొందరు ఉంటే, కొందరు మాత్రం ఓపెన్‌గా మాట్లాడేస్తూ ఉంటారు.
హీరోలకూ కాస్మోటిక్ సర్జరీలు
ఇటీవల హీరోయిన్ శృతి హాసన్ కాస్మోటిక్ సర్జరీ గురించి మాట్లాడుతూ తాను అందంగా కనిపించడం కోసం ఏదైనా చేయాలి అంటే చేసేందుకు సిద్ధంగా ఉంటాను. సినిమా ప్రపంచంలో రాణించాలంటే అందంగా కనిపించాలి, అందంగా ఉండటం కోసం సర్జరీలు తప్పవు అన్నప్పుడు చేయించుకుంటే తప్పేంటి అనేది ఆమె వాదన. ఈ మధ్య కాలంలో కాస్మోటిక్ సర్జరీల గురించి మాట్లాడేందుకు హీరోయిన్స్ ముందుకు వస్తున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాకుండా హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా పలు సార్లు, పలు సందర్భాల్లో కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నారు. కానీ హీరోయిన్స్ గురించే మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉండటం విశేషం. ఈ విషయమై తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ స్పందించారు.
గ్లామర్ ప్రపంచంలో తప్పదు
కాస్మోటిక్ సర్జరీ అనేది కేవలం ఆడవారికి సంబంధించిన విషయం అన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తూ ఉంటాయి. హీరోయిన్స్ కాస్మోటిక్ సర్జరీల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే మీడియాలో ఎందుకు హీరోల యొక్క సర్జరీల గురించి మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నించారు. కెమెరా ముందు అందంగా కనిపించేందుకు ప్రతి ఒక్కరిపై ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కాస్మోటిక్ సర్జరీకి హీరోలు, హీరోయిన్స్ వెళ్లాల్సి ఉంటుంది. గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు. కానీ కేవలం హీరోయిన్స్‌ను మాత్రమే కొందరు టార్గెట్ చేస్తూ ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కాజోల్ చెప్పుకొచ్చింది.
50 ఏళ్ల వయసులోనూ అదే అందం
తాజాగా కాజోల్ నటించిన 'సర్జమీన్' సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కాజోల్ ఈ విషయమై స్పందించారు. అందంగా కనిపించడం కోసం చేసే పనుల్లో కాస్మోటిక్ సర్జరీ ఒకటి అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఆమె ఈ సర్జరీని చేయించుకున్నారా అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వలేదు. మరో వైపు ఈమె వయసు గురించి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ వయసులోనూ ఇంత అందంగా ఉన్నారు అంటూ వచ్చే కామెంట్స్ గురించి స్పందిస్తూ... నేను జీవితంలో బలంగా, ఉత్సాహంగా ఉండటం కోసం ప్రయత్నిస్తాను. వయసుతో సంబంధం లేకుండా తాను జీవితాన్ని సాగిస్తున్నాను అంది.
కాజోల్ ఇటీవలే 50 ఏళ్ల వయసులో అడుగు పెట్టింది. ఇప్పటికీ చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తూ, యంగ్ హీరోయిన్స్‌కి పోటీగా నిలుస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈమె నటించిన రెండు సినిమాలు వచ్చాయి. మరో వైపు వెబ్ సిరీస్‌లపైనా ఈమె ఆసక్తి కనబర్చుతోంది. త్వరలోనే ఈమె నుంచి ఒక భారీ యాక్షన్ వెబ్ సిరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
