Begin typing your search above and press return to search.

పెళ్లిపై సీనియ‌ర్ న‌టి షాకింగ్ కామెంట్

పెళ్లి గురించి ఒక్కో న‌టి ఒక్కో అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. చాలా మంది ఒంట‌రి జీవితమే ప‌ర‌మావ‌ధి కాద‌ని, ఏదో ఒక రోజు పెళ్లితో లైఫ్ లో సెటిల‌వుతామ‌ని వెల్ల‌డిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   13 Nov 2025 7:00 PM IST
పెళ్లిపై సీనియ‌ర్ న‌టి షాకింగ్ కామెంట్
X

పెళ్లి గురించి ఒక్కో న‌టి ఒక్కో అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. చాలా మంది ఒంట‌రి జీవితమే ప‌ర‌మావ‌ధి కాద‌ని, ఏదో ఒక రోజు పెళ్లితో లైఫ్ లో సెటిల‌వుతామ‌ని వెల్ల‌డిస్తున్నారు. కానీ పెళ్ల‌యిన సెల‌బ్రిటీ క‌పుల్ విడిపోయిన‌ప్పుడు అది మీడియా హెడ్ లైన్స్ లోకి రావ‌డం హాట్ టాపిగ్గా మారుతోంది. అయితే పెళ్లిపై సీనియ‌ర్ న‌టి కాజోల్ అభిప్రాయం ఇప్పుడు హెడ్ లైన్ గా మారింది.

పెళ్లికి ఒక ముగింపు తేదీ ఉండాల‌నేది కాజోల్ అభిప్రాయం.. దానివ‌ల్ల గ‌డువు తేదీ కంటే ఎక్కువ కాలం పెళ్ల‌యిన‌ జంట బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దని బోల్డ్ కామెంట్ చేసారు. అయితే ట్వింకిల్ ఖ‌న్నా దీనికి భిన్న‌మైన వాద‌న వినిపించారు. ``ఇది వివాహం.. వాషింగ్ మెషీన్ కాదు..`` అని కాజోల్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. ట్వింకిల్ ఖన్నా- కాజోల్ `టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షోలో పెళ్లిపై సాగించిన డిబేట్‌లో సీనియ‌ర్ భామ‌లు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసారు.

పెళ్లికి ఒక వ్య‌వ‌ధి ఉంటే, ఆ త‌ర్వాత క‌ల‌త‌లు ఉండ‌వు! అనే అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ కాజోల్ స్వ‌రంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సీనియ‌ర్ న‌టి అభిప్రాయంతో చాలా మంది విభేధించారు. ఈ షోలో విక్కీ కౌశల్ - కృతి సనన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. షోలో పెళ్లి గురించిన ప్ర‌శ్న‌ల‌కు విక్కీ, కృతి స్పందించారు.

కాజోల్, ట్వింకిల్ ఇద్ద‌రూ తెలుగు చిత్రసీమ‌కు సుప‌రిచిత‌మైన న‌టీమ‌ణులు. అర‌వింద స్వామి, ప్ర‌భుదేవా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `మెరుపు క‌ల‌లు` చిత్రంలో కాజోల్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్ తో క‌లిసి ఓ త‌మిళ చిత్రంలోను న‌టించారు. ఇటీవ‌ల బాలీవుడ్ లో నాయికా ప్ర‌ధాన చిత్రాల‌లో న‌టిస్తున్నారు. ఈ ఏడాది `మా` అనే హార‌ర్ చిత్రంతో పాటు, స‌ర్జ‌మీన్ అనే చిత్రంలోను కాజోల్ న‌టించారు. స‌ర్జమీన్ లో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. మ‌రో సీనియ‌ర్ న‌టి ట్వింకిల్ ఖ‌న్నా తెలుగులో వెంక‌టేష్ స‌ర‌స‌న `శీను` అనే చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత బాలీవుడ్ సినిమాల‌కే ట్వింకిల్ ఎక్కువ ప్రాధాన్య‌త‌నిచ్చారు. ట్వింకిల్ ఇటీవ‌ల పుస్త‌క ర‌చ‌యిత‌గా కొన‌సాగుతున్నారు. ట్వింకిల్ ఖన్నా నాన్-ఫిక్షన్ పుస్తకం మిసెస్ ఫన్నీబోన్స్ (2015), పైజామాస్ ఆర్ ఫర్గివింగ్ (2018), వెల్‌కమ్ టు ప్యారడైజ్ (2023) వంటి నవలను ర‌చించారు. నటనలో విజయవంతమైన కెరీర్ తర్వాత రచనా రంగంపై మ‌క్కువ‌తో ఈ రంగంలో రాణిస్తున్నారు. ట్వింకిల్ బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ని పెళ్లాడ‌గా, కాజోల్ బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.