ఆమె పొట్ట భాగాన్ని జూమ్ చేస్తారా? ఎంత ధైర్యం!
సోషల్ మీడియా అనే స్వేచ్ఛా ప్రపంచంలో నటీమణులపై బాడీ షేమింగ్ అన్నది ఎంత సంచలన మవుతుందో తెలిసిందే.
By: Srikanth Kontham | 26 Aug 2025 1:38 AM ISTసోషల్ మీడియా అనే స్వేచ్ఛా ప్రపంచంలో నటీమణులపై బాడీ షేమింగ్ అన్నది ఎంత సంచలన మవుతుందో తెలిసిందే. నటీ రూపలావణ్యాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్లు నిరంతరం చర్చకు దారి తీస్తునే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా నటీమణులంతా బాడీ షేమింగ్ గురవుతూనే ఉన్నారు. ప్రముఖంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా బాడీ షేమింగ్ బారిన పడు తున్నారు. తాజాగా మరోసారి బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ బాడీ షేమింగ్ కి గురైంది.
ఇటీవలే ముంబైలో జరిగిన `ది ట్రయల్ సీజన్ 2` ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి కాజల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కాజల్ స్టైలిష్ దుస్తుల్లో తళుక్కున మెరిసారు. మెటాలిక్ నెక్‌లైన్ తో కూడిన బ్లాక్ బాడీకాన్ దుస్తులను ధరించారు. దీనికి సంబంధించి ఓ యూజర్ అనుచిత వీడియో పోస్ట్ చేసాడు. కాజల్ శరీరాన్ని, ప్రత్యేకించి ఆమె కడుపు భాగాన్ని జూమ్ చేసి ఆ భాగాలను హైలైట్ చేసాడు. ఈ వీడియో సోషల్ మీడి యాలో వైరల్ గా మారింది.
దీంతో సోషల్ మీడియాలో కాజల్ రూపం పై రకరకాల కామెంట్లు పడ్డాయి. కొంత మంది కాజల్ గర్బవతి అని కామెంట్ చేసారు. ఈ తీరును ఉద్దేశించి టీవీ హోస్ట్, నటి మినీ మాథుర్ నిప్పులు చెరిగారు. `ఆమె శరీరాన్ని జూమ్ చేయడానికి మీకు ఎంత ధైర్యం? అలాంటి వీడియో ఎలా తీయగలిగారు? ఆమె ఎలా కనిపించాలో నిర్దేశించే హక్కు మీకు లేదని మండిపడ్డారు. కాజల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గళం విప్పారు. బాడీ షేమింగ్ కి ఇంకెంతమంది నటీమణుల్ని బలి చేస్తారు? మీ ఆనందాల కోసం ఎదుట వారి ప్రయివేట్ స్పేస్ పై దాడి చేస్తారా? అంటూ అభిమానులు మండిపడ్డారు.
ఏ నటీ ఎల్లుపుడూ ఒకే రకమైన రూపాన్ని, ప్రమాణాలు కలిగి ఉండలేరని.. వయసుతో పాటు శరీరంలో వచ్చే మార్పు లను సహజమన్నారు. వాటిని భూతద్దం పెట్టి చూడటం మానేసినప్పుడే మహిళలకు అస లైన గౌరవం దక్కినట్లని నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. కాజల్ అగర్వాల్ ఇలా బాడీ షేమింగ్ కి గురవ్వడం మొదటిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి ఫేజ్ ని చూసిన వారే.
