Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్‌ ఆస్తుల విలువ రూ.240 కోట్లు

నేడు ఈ సీనియర్‌ హీరోయిన్‌ పుట్టిన రోజు. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆమె గురించి చర్చ జరుగుతోంది.

By:  Ramesh Palla   |   5 Aug 2025 4:08 PM IST
ఆ హీరోయిన్‌ ఆస్తుల విలువ రూ.240 కోట్లు
X

ఏ భాష సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ ఒక ఏజ్‌ వచ్చిన తర్వాత కనిపించకుండా పోతారు. ఎక్కువ శాతం నాలుగు పదుల వయసులో అడుగు పెడితే మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరం కావడం, ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ కావడం జరుగుతుంది. కానీ కొద్ది మంది హీరోయిన్స్ మాత్రం ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. వచ్చిన అవకాశం చేశాం అన్నట్లుగా కాకుండా స్టార్‌డంతో వరుస సినిమాలు చేయడం అతి కొద్ది మంది హీరోయిన్స్‌కి సాధ్యం. అయిదు పదుల వయసు దాటిన సీనియర్‌ హీరోయిన్స్‌ బాలీవుడ్‌లో అతి కొద్ది మంది ఉన్నారు. వారిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే బిజీగా ఉన్నారు. అందులో హీరోయిన్‌ కాజోల్‌ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూనే ఉండటం వల్ల అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.

కాజోల్‌ బర్త్‌డే స్పెషల్‌

నేడు ఈ సీనియర్‌ హీరోయిన్‌ పుట్టిన రోజు. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆమె గురించి చర్చ జరుగుతోంది. ఆగస్టు 5ను కాజోల్‌ ఫ్యాన్స్‌ ప్రత్యేకమైన రోజుగా జరుపుకుంటూ ఉంటారు. కాజోల్‌ తాజాగా 51 ఏళ్ల వయసులో అడుగు పెట్టింది. ఈ వయసులో కాజోల్‌ ఆస్తుల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆమె రియల్‌ ఎస్టేట్‌ పై ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఉండటం వల్ల ఆ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. కాజోల్‌ పూర్తి ఆస్తుల విలువ రూ.240 కోట్లు కాగా, ఆమె రియల్‌ ఎస్టేట్‌ ద్వారానే ఏకంగా రూ.180 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్‌కి ఈ స్థాయి ఆస్తులు ఉండటం అనేది బాలీవుడ్‌లో అరుదుగా చూస్తూ ఉంటాం. వందల కోట్ల ఆస్తులు ఉన్న హీరోలు ఉన్నారు కానీ హీరోయిన్స్‌ అరుదుగా కనిపిస్తూ ఉంటారు.

ముంబైలోని ఖరీదైన ఏరియాలో ఆస్తులు

ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకారం కాజోల్‌ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో కాజోల్‌ ఆస్తులు ఉన్నాయి. లింకింగ్‌ రోడ్‌లోని గోరేగావ్‌లో దాదాపుగా రూ.30 కోట్ల విలువైన ఆస్తి ఉంది. మరో వైపు ఒక కమర్షియల్‌ బిల్డింగ్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 4,365 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. దాని ఖరీదు భారీగా ఉంటుందని అంటున్నారు. జుహులో ఖరీదైన రెండు అపార్ట్‌మెంట్‌లను కాజోల్ తన పేరు మీద రిజిస్ట్రర్‌ చేయించుకుంది. అంతే కాకుండా పలు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ఇంకా కమర్షియల్‌ స్పేస్‌లను కాజోల్‌ కొనుగోలు చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో కాజోల్‌ ఆస్తుల విలువ దాదాపుగా రూ.250 కోట్లు ఉంటుందని కూడా కొందరు అంటూ ఉంటారు. అయితే అధికారికంగా మాత్రం రూ.180 కోట్లుగా చెబుతున్నారు.

అజయ్‌ దేవగన్‌ సైతం బిజీ బిజీ

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్ దేవగన్‌ ను పెళ్లి చేసుకున్న కాజోల్‌ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ బిజీ బిజీగా నటిస్తూ ఉన్న కారణంగా ఆస్తులు అమాంతం పెరిగి పోయాయి. అజయ్‌ దేవగన్ సైతం సినిమాకు ఒక్కంటికి పదుల కోట్ల పారితోషికం తీసుకుంటాడు. అందుకే కాజోల్‌, అజయ్‌ దేవగన్‌ల ఆస్తులు బాలీవుడ్‌ లోని చాలా మంది స్టార్స్‌తో పోల్చితే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆ మీడియా సంస్థ కథనంలో పేర్కొంది. కాజోల్‌ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తున్న కారణంగా ముందు ముందు ఆమె ఆస్తుల వివరాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆమె కొనుగోలు చేసిన ఆస్తులు ముంబైలోని ప్రైమ్‌ ఏరియాలో ఉన్నాయి. కనుక వాటి రేట్లు పదుల రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.