Begin typing your search above and press return to search.

కాజోల్‌కు అక్షయ్ కుమార్‌పై క్రష్!

బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో కరణ్ జోహార్ - కాజోల్ మంచి స్నేహితులు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం కొన్ని ద‌శాబ్దాలుగా కొన‌సాగుతోంది.

By:  Srikanth Kontham   |   25 Aug 2026 12:00 AM IST
కాజోల్‌కు అక్షయ్ కుమార్‌పై క్రష్!
X

బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో కరణ్ జోహార్ - కాజోల్ మంచి స్నేహితులు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం కొన్ని ద‌శాబ్దాలుగా కొన‌సాగుతోంది. ఇద్ద‌రు ఎంతో ఓపెన్ గా ఉంటారు. ఒక‌రి గురించి మ‌రొక‌రు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు.

ఇద్ద‌రి సరదా సంఘటనలకు సంబంధించిన విషయాలు నెట్టింట ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత ఇంటర్వ్యూకి సంబంధించిన విశేషాలు ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. కపిల్ శర్మ షోలో పాల్గొన్న సందర్భంగా కరణ్ జోహార్ - కాజోల్ త‌మ మొదటి పరిచ యం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఆ సమయంలో కాజోల్ తనపై ఎలా విపరీతంగా నవ్విందో కరణ్ జోహార్ సరదాగా ప్రస్తావించారు. ఒక డిస్కోటెక్‌లో జరిగిన పార్టీలో కరణ్ జోహార్ మూడు ముక్కల సూటు, టై ధరించి స్ట్రైట్‌గా నిలబడటాన్ని చూసి కాజోల్ ఆపకుండా అర గంటపాటు నవ్వుతూనే ఉన్నారుట‌. అది తనను ఎంతో అవమానానికి గురి చేసిందని కరణ్ సరదాగా గుర్తు చేసుకున్నారు. ఆ సంఘటన తర్వాత ఇద్ద‌రు మరోసారి ఒక సినీ వేడుకలో కలుసుకోవడం జరిగిందని కరణ్ వెల్లడించారు. రిషి కపూర్, జేబా బక్తియార్ నటించిన `హెన్నా` సినిమా ప్రీమియర్ షో సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు.

ఆ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అంటే కాజోల్‌కు విపరీతమైన క్రష్ ఉండేదని కరణ్ జోహార్ బహిరంగంగానే బాంబు పేల్చారు. ఆ ప్రీమియర్ వేడుకలో కాజోల్ ఆవరణంతా అక్షయ్ కుమార్ కోసం వెతుకుతూనే ఉందని.. ఆ స‌మ‌యంలో తాను కూడా ఆమెకు సపోర్ట్‌గా నిలిచానని కరణ్ గుర్తు చేసుకున్నారు. ఇద్దరం కలిసి రహస్యంగా అక్షయ్ కుమార్‌ కోసం వెతికాం అని ఆయన నవ్వుతూ చెప్పారు. ఎంత వెతికినా? ఆ రోజు అక్షయ్ కుమార్ త‌మ‌కు దొర‌క‌క‌పోయినా? ఒకరికొకరు మాత్రం మంచి స్నేహితులుగా మారామని కరణ్ జోహార్ తెలిపారు.

అలా అక్షయ్ కుమార్ కోసం వెతికే క్రమంలో మొదలైన ప్రయాణం కాలక్రమేణా బాలీవుడ్‌లో ఇద్ద‌రి మ‌ధ్య బలమైన స్నేహ బంధంగా మారింద‌న్నారు. వెండితెరపై ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన జోడీ రియల్ లైఫ్‌లో ఇలాంటి మధురమైన జ్ఞాపకాలను పంచుకోవడం అభి మానులను ఎంతగానో అలరిస్తోంది. కానీ కాజోల్ క్ర‌ష్ అక్క‌డికే ప‌రిమిత‌మైంది. కాల క్ర‌మంలో కాజోల్ అజ‌య్ దేవ‌గ‌ణ్ తో ప్రేమ‌లో ప‌డి అత‌డినే వివాహం చేసుకున్నారు. అక్ష‌య్ కుమార్ మాత్రం న‌టి ట్వింకిల్ క‌న్నాను వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ జోడీలు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.