Begin typing your search above and press return to search.

కాజల్‌ ఉండగా.. సాయిపల్లవి కోసం ఆరాటమా?

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘రామాయణం’కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నా.. సీతారాముల మధ్య ఎమోషనల్ కనెక్షన్ మిస్సయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీత పాత్రలో సాయిపల్లవి ఎంపికపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మండోదరిగా నటించిన కాజల్ అగర్వాల్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో సాయిపల్లవిపై మీమ్స్, ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే సీతగా సాయిపల్లవి నటనను మెచ్చుకుంటున్నవారూ ఉన్నారు.

By:  Garuda Media   |   7 Nov 2026 9:30 AM IST
కాజల్‌ ఉండగా.. సాయిపల్లవి కోసం ఆరాటమా?
X

నిన్న భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామాయణం’ సినిమా చాలా వరకు పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది. కానీ ఇందులో కొన్ని లోపాలు లేకపోలేదు. విజువల్‌గా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఎమోషనల్ కనెక్ట్ మిస్సయిందన్నది ఎక్కువమంది చెబుతున్న కంప్లైంట్. ముఖ్యంగా సీతారాముల మధ్య కెమిస్ట్రీ పండలేదని.. ఆ జంటను చూస్తే కలగాల్సిన ఆరాధన భావం కలగలేదని.. అందుకే సినిమా ఎమోషనల్‌గా కదిలించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

రాముడిగా రణబీర్ కపూర్ బాగానే చేసినా.. తన పక్కన సీతగా సాయిపల్లవి కుదరలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి బేసిగ్గా మంచి పెర్ఫామరే అయినా.. సీత పాత్రకు ఆమె సూట్ కాలేదని చాలామంది అంటున్నారు. సీత అంటే ముగ్ధ మనోహరమైన అందంతో పాటు ఒక కంపోజర్ ఆశిస్తారు ప్రేక్షకులు. అది సాయిపల్లవిలో మిస్సయిందన్నది ఎక్కువమంది చేస్తున్న కంప్లైంట్.

సీతగా సాయిపల్లవిని మెచ్చని వాళ్లు ఆమె మీద ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. ఇందుకోసం వాడుతున్న ఒక మీమ్ బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రావణుడి భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే. కాజల్ అంటే అందానికి పెట్టింది పేరు. ఒకప్పటితో పోలిస్తే ఛార్మ్ తగ్గినా సరే.. ఇప్పటికీ ఆమెకు భారీగా అభిమానులున్నారు. అందం కోణంలో చూస్తే కాజల్ ముందు సాయిపల్లవి నిలవజాలదు. ఈ నేపథ్యంలో ఇంట్లో కాజల్ లాంటి భార్యను పెట్టుకుని.. ఏ మగాడైనా సాయిపల్లవి లాంటి యావరేజ్ అమ్మాయి కోసం ఎవరైనా ఎగబడతారా అంటూ.. దీన్నొక మీమ్‌గా మార్చి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

కాజల్ అగర్వాల్ పాత్రను మరీ తగ్గించేయడం పట్ల కూడా ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఐతే కొందరు మాత్రం సీత పాత్రలో సాయిపల్లవి మంచి పెర్ఫామెన్స్ ఇచ్చిందని, ఆమెను తక్కువ చేయడానికి వీల్లేదని అంటున్నారు. నితీశ్ తివారి దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణం’ను నమిత్ మల్హోత్రా నిర్మించగా.. హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్‌తో పాటు ఇండియన్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.