Begin typing your search above and press return to search.

పురుగుమందుల వాడ‌కంపై క్లాస్ తీస్కుంటున్న కాజ‌ల్ అగ‌ర్వాల్

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. గ్లోబ‌ల్ వార్మింగ్ ఎఫెక్ట్ స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.

By:  Sivaji Kontham   |   29 April 2026 9:21 AM IST
పురుగుమందుల వాడ‌కంపై క్లాస్ తీస్కుంటున్న కాజ‌ల్ అగ‌ర్వాల్
X

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. గ్లోబ‌ల్ వార్మింగ్ ఎఫెక్ట్ స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌యోగం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అస‌లింత‌కీ కాజ‌ల్ ఎలాంటి ప్ర‌యోగం చేస్తోంది? అంటే....

ఈరోజు మండే ఎండ‌ల‌తో పాటు, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యానికి కార‌ణ‌మ‌య్యే ఫ్యాక్ట‌ర్స్ .. పంట‌ల‌పై ఉప‌యోగించే ర‌సాయ‌నాల తో ముప్పు గురించిన ఆస‌క్తిక‌ర క‌థ‌తో సినిమా చేస్తోంది...ఈ సినిమా క‌థాంశం కేవ‌లం ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం గురించే కాదు.. ప్రధానంగా వ్యవసాయ రంగంలో రసాయనాల దుర్వినియోగం - పురుగుమందుల వాడకం వల్ల తలెత్తుతున్న భయంకరమైన పరిణామాల చుట్టూ తిరుగుతుంది. కేవలం ఒక కుటుంబం ఎదుర్కొనే సమస్యగానే కాకుండా, ప్రజారోగ్యం-భద్రతను ప్రమాదంలో పడేస్తున్న జాతీయ స్థాయి సంక్షోభాన్ని ఈ కథలో చర్చించనున్నారు. పురుగుమందుల కుంభకోణాలు వ్యవస్థలోని వైఫల్యాలను ఎండగడుతూ.. కఠినమైన నియంత్రణల అవసరాన్ని ఈ చిత్రం గుర్తు చేయనుంది. మనం గమనించకుండా వదిలేస్తున్న ఈ వాస్తవికత ఎందరో ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇదొక పర్యావరణ సమస్య మాత్రమే కాదు.. మానవ సంక్షోభం కూడా.. అని నిర్మాత సాగర్ బి షిండే చిత్ర నేపథ్యాన్ని వివరించారు. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని తెలుస్తోంది.

సామాజిక ఇతివృత్తంతో ప్ర‌యోగం:

గ్లోబ‌ల్ వార్మింగ్ ముప్పును ఎదుర్కొంటున్న ఈ స‌మ‌యంలో నిజంగా కాజ‌ల్ టైమింగ్ బావుంది.. స‌రైన స‌మ‌యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆస‌క్తిక‌ర స‌బ్జెక్ట్ తో ముందుకు వ‌స్తోంది..కాజ‌ల్- శ్రేయస్ తల్పాడే కీలక పాత్రల‌లో నటిస్తున్న ఈ ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రానికి `ది ఇండియా స్టోరీ` అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే ఒక సామాజిక అంశం నేపథ్యంలో సాగే ఈ సోషియో-నేషనల్ డ్రామాను జూలై 24న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చేతన్ డికె ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. సాగర్ బి షిండే నిర్మించడమే కాకుండా కథను కూడా అందించారు. జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది.

నిశాంత్ భాగవత్ సినిమాటోగ్రఫీ, మంగేష్ ధక్డే సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. సామాజిక బాధ్యతతో కూడిన అంశాలను చర్చిస్తూనే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథనాన్ని సిద్ధం చేసినట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇకపై అన్నీ ప్ర‌యోగాలే:

ఇక‌పై ఖైదీనంబ‌ర్ 150 లేదా డార్లింగ్ లాంటి సినిమాల్లో కాజ‌ల్ న‌టించేందుకు అవ‌కాశం లేదు.. లేడీ ఓరియెంటెడ్ లేదా సామాజిక స్పృహ‌.. మంచి కాజ్ కోసం సినిమాలు చేయ‌డానికి మొగ్గు చూపుతోంది. ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో న‌ట‌నాభిరుచిని కొన‌సాగించ‌నుంది.