Begin typing your search above and press return to search.

మళ్ళీ అదే మిస్టేక్ చేస్తోన్న కాజల్.. బెడిసి కొట్టిందా ఇక అంతే!

హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ కి సినీ ఇండస్ట్రీలో లైఫ్ టైం చాలా తక్కువ అనే చెప్పాలి.

By:  Madhu Reddy   |   12 Dec 2025 10:52 AM IST
మళ్ళీ అదే మిస్టేక్ చేస్తోన్న కాజల్.. బెడిసి కొట్టిందా ఇక అంతే!
X

హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ కి సినీ ఇండస్ట్రీలో లైఫ్ టైం చాలా తక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరోల వయసు 6 పదులు.. కాదు కాదు ఏడు పదుల వయసు దాటినా ఇంకా హీరోలుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే హీరోయిన్స్ మాత్రం పెళ్లయిన లేదా వారి సినిమాలు వరుసగా ఫ్లాప్ లైనా సరే ఇక మళ్ళీ వారికి అవకాశాలు రావు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. ఒకప్పుడు చందమామ, లక్ష్మీ కళ్యాణం, మగధీర వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మరింత ఇమేజ్ దక్కించుకుంది.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చలామణి అయిన కాజల్ అగర్వాల్ సినిమా అవకాశాలు కాస్త తగ్గడంతో తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొంతకాలానికే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక వివాహం అనంతరం మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈమెను పలకరించే వారే లేరు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాంటి ఈమెకు ఇప్పుడు తెలుగులో వెబ్ సిరీస్ చేసే అవకాశం వచ్చింది.

విషయంలోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో కాజల్ నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ రీమేక్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. హిందీలో భారీ సక్సెస్ అందుకున్న ఆర్య కు ఇది రీమేక్ అట. అయితే ఆర్య కూడా ఒక విదేశీ సిరీస్ కు రీమేక్. దానిని ఇప్పుడు దక్షిణాదిన రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే హిందీ వెర్షన్ లో సుస్మిత సేన్ ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో ఆమె నడి వయస్కరాలు పాత్ర పోషించింది. పైగా వయసుకు ఎదిగిన పిల్లలు కూడా ఉంటారు. అలాంటి పాత్రలో ఇప్పుడు కాజల్ నటించబోతోంది అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి.

నిజానికి ఇంతకుముందు ఈమె లైవ్ టెలికాస్ట్ అనే హారర్ వెబ్ సిరీస్ లో నటించింది. కానీ దీనికి పెద్దగా స్పందన రాలేదు. అయితే ఇప్పుడు మళ్లీ అదే మిస్టేక్ చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఇప్పుడు మళ్లీ వెబ్ సిరీస్ చేయనుంది. పైగా వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించబోతోంది అని తెలిసి అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ ఈ వెబ్ సిరీస్ గనుక బెడిసి కొట్టిందంటే పరిస్థితి ఏంటి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. అసలే హీరోయిన్గా అవకాశాలు లేక సతమతమవుతున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఈ రీమేక్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ తో కాజల్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.