Begin typing your search above and press return to search.

పిక్ టాక్: గ్లామర్‌కు న్యూ డెఫినిషన్ ఇచ్చిన కాజల్… 40లోనూ యూత్ ఫుల్ లుక్!

భారతీయ సినీ రంగంలో తన అందం, అభినయం, స్థిరమైన కెరీర్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 March 2026 11:11 AM IST
పిక్ టాక్: గ్లామర్‌కు న్యూ డెఫినిషన్ ఇచ్చిన కాజల్… 40లోనూ యూత్ ఫుల్ లుక్!
X

భారతీయ సినీ రంగంలో తన అందం, అభినయం, స్థిరమైన కెరీర్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్. పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన ఫిట్‌నెస్‌ మరియు గ్లామర్‌ను నిలబెట్టుకుంటూ కాజ‌ల్ త‌న అందం ప‌రంగా చూపిస్తున్న మార్పు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఆల్రెడీ 40ల్లోకి అడుగుపెట్టిన కాజల్, నాలుగేళ్ల కుమారుడికి తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా తన ఆరోగ్యంపై క్రమశిక్షణతో శ్రద్ధ పెట్టారు. ఫిట్‌నెస్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టి బ‌రువు త‌గ్గి మరింత స్లిమ్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఆమె ప్రతి కొత్త పబ్లిక్ అపియరెన్స్ ఈ కృషికి నిదర్శనంగా నిలుస్తోంది.





సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌నకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలోవ‌ర్ల‌తో పంచుకునే కాజ‌ల్ అగ‌ర్వాల్ తాజాగా కొన్ని ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో కాజ‌ల్ సాఫ్ట్ న్యూడ్ టోన్ డ్రెస్‌లో ఎంతో ఎలిగెంట్‌గా క‌నిపించారు. ఆమె లుక్ కు తాను ధ‌రించిన స్లీవ్‌లెస్, హై-నెక్ డిజైన్ మ‌రింత‌ క్లాసీ టచ్ ను ఇచ్చింది. మినిమల్ మేకప్, నీట్ హెయిర్ స్టైల్, సబ్టిల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సింపుల్‌గా కనిపించినప్పటికీ, ఆమె లుక్ మాత్రం చాలా స్టైలిష్‌గా నిలిచింది. ఆమె టోన్డ్ ఫిజిక్ ఈ అవుట్‌ఫిట్‌లో మరింత హైలైట్ అయింది.





ఇక అమ్మ‌డి కెరీర్ విషయానికి వస్తే, లక్ష్మీ కళ్యాణం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్, చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లోని అగ్రహీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగిన ఆమె, పెళ్లి మరియు ప్రెగ్నెన్సీ కారణంగా కొంతకాలం కెరీర్ బ్రేక్ తీసుకున్నారు.





తరువాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కాజల్, పాత్రల ఎంపికలో కొత్తదనాన్ని చూపిస్తున్నారు. రీసెంట్ గా కన్నప్ప సినిమాలో కనిపించిన ఆమె, ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ‌ ప్రాజెక్ట్‌లో మండోదరి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మొత్తంగా, వ్యక్తిగత జీవితం మరియు ప్రొఫెషనల్ కెరీర్ మధ్య సమతుల్యతను కొన‌సాగిస్తూ కాజ‌ల్ ముందుకు సాగుతున్నారు.