Begin typing your search above and press return to search.

క‌ష్టాల్లో ఆ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్

అయితే ఎంత ఫోక‌స్ చేసినా వారికి అవ‌కాశాలు త‌గ్గ‌డమ‌నేది మామూలే. ఒక‌ప్పుడున్న క్రేజ్ ఇప్పుడు రావాలంటే రాదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   15 Dec 2025 11:00 PM IST
క‌ష్టాల్లో ఆ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్
X

హీరోయిన్లు అంద‌రికీ సిల్వ‌ర్ స్క్రీన్ పై సెకండ్ ఇన్నింగ్స్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాదు. ఒక‌వేళ మ‌ళ్లీ స్క్రీన్ పై క‌నిపించాల‌నుకున్నా, బిజీగా మారాల‌నుకున్నా స‌పోర్టింగ్ రోల్స్ తోనే స‌రిపెట్టుకోవాలి త‌ప్పించి మ‌ళ్లీ ఒక‌ప్ప‌టిలా హీరోయిన్ పాత్ర‌లే అంటే ఆ అవ‌కాశం రాదు. కానీ చాలామంది మాత్రం రీఎంట్రీ టైమ్ లో కూడా హీరోయిన్ పాత్ర‌ల‌పైనే ఎక్కువ ఫోక‌స్ చేస్తుంటారు.

అయితే ఎంత ఫోక‌స్ చేసినా వారికి అవ‌కాశాలు త‌గ్గ‌డమ‌నేది మామూలే. ఒక‌ప్పుడున్న క్రేజ్ ఇప్పుడు రావాలంటే రాదు. ఒక‌సారి గ్యాప్ వ‌చ్చిందంటే ఆ గ్యాప్ అలానే ఉండిపోతుంది త‌ప్పించి ఆ గ్యాప్ త‌గ్గిపోయి మ‌ళ్లీ బిజీ అవ‌డం చాలా త‌క్కువ మంది విష‌యంలోనే జ‌రుగుతుంది. ఇక అస‌లు విష‌యానికొస్తే టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌ప్పుడు ఏ స్థాయి స్టార్‌డ‌మ్ ను అందుకున్నారో తెలిసిందే.

అనుకోకుండా కెరీర్లో గ్యాప్ తీసుకున్న కాజ‌ల్

పెళ్లి, ప్రెగ్నెన్సీ కార‌ణంతో సిల్వ‌ర్ స్క్రీన్ నుంచి కెరీర్లో కాస్త గ్యాప్ తీసుకున్న కాజ‌ల్ కు అప్ప‌టికే ఫామ్ త‌గ్గ‌డంతో రీఎంట్రీ త‌ర్వాత కూడా పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఇంకా చెప్పాలంటే ఒక‌ప్పుడు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ గా ప‌రిగ‌ణించిన కాజ‌ల్ కు రీఎంట్రీ త‌ర్వాత అస‌లు అలాంటి పాత్ర‌లే రాలేదు. ఫ‌లితంగా గ‌త కొన్నేళ్ల‌లో కాజ‌ల్ కెరీర్లో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు.

దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్ కెరీర్ క‌ష్టాల్లో ప‌డిపోయింది. సీనియ‌ర్ హీరోల‌తో సినిమాలు చేసినా అమ్మ‌డికి మంచి ఆఫ‌ర్లు రాలేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ‌లో మండోద‌రి పాత్ర‌లో న‌టిస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్, ఇప్పుడు విశాఖ అనే వెబ్‌సిరీస్ లో ముగ్గురు పిల్ల‌ల త‌ల్లి పాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా స‌రైన అవ‌కాశాలు రాక‌నే సెకండ్ ఇన్నింగ్స్ లో కాజ‌ల్ ఇలాంటి స‌పోర్టింగ్ రోల్స్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తుంది. మ‌రి ఇలాగైనా కాజ‌ల్ బిజీగా మారుతారేమో చూడాలి.