Begin typing your search above and press return to search.

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

కాజల్ అగర్వాల్ తన ప్రేమకథ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గౌతమ్ కిచ్లూతో 13, 14 ఏళ్ల క్రితమే ప్రేమలో ఉన్నామని, మధ్యలో విడిపోయి ఇతరులతో డేటింగ్ చేశామని తెలిపింది. కరోనా సమయంలో మళ్లీ దగ్గరయ్యామని, ఈసారి పెళ్లి చేసుకుందాం లేదా పూర్తిగా విడిపోదామని తానే అడిగినట్లు చెప్పింది. 2020 అక్టోబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   15 Nov 2026 9:04 AM IST
భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!
X

టాలీవుడ్‌లో చందమామగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ సాధారణంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయటకు చెప్పడానికి పెద్దగా ఇష్టపడదు. సినిమాలు గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడే ఈమె తాజాగా తన ప్రేమకథ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

ముఖ్యంగా తన భర్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకోవడానికి ముందు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటకి చెప్పడంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాజల్, గౌతమ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే తెలిసిందే. అయితే వీరిద్దరి ప్రేమ ప్రయాణం మొదటి నుంచి సాఫీగా సాగలేదట. దాదాపు 13 లేదా 14 ఏళ్ల క్రితమే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని కాజల్ వెల్లడించింది. కానీ అప్పట్లో కొన్ని కారణాల వల్ల, ఇద్దరూ విడిపోయి తమ జీవితాల్లో ముందుకు వెళ్లిపోయారట.

ఈ క్రమంలో ఇద్దరూ ఇతర వ్యక్తులతో డేటింగ్ కూడా చేశారని కాజల్ చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.

"మేము దాదాపు 13 లేదా 14 ఏళ్ల క్రితం ప్రేమలో ఉన్నాం. కానీ మధ్యలో విడిపోవలసి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరం మా జీవితాల్లో ముందుకు వెళ్లిపోయాం. ఇతర వ్యక్తులతో డేటింగ్ చేశాం. కానీ ఆ అనుభవాల ద్వారా మాకు ఏం కావాలో అర్థమైంది" అని కాజల్ తన ప్రేమకథ గురించి వివరించింది.

ఇక కరోనా సమయంలో వీరిద్దరూ మరోసారి దగ్గరయ్యారట. అయితే ఈసారి మాత్రం మళ్లీ విడిపోవడం జరగకూడదని.. అందుకే వెంటనే తన భర్తని.. పూర్తిగా గుడ్ బై చెప్పుకుందాం లేకపోతే పెళ్లి చేసుకునేదం అని అడిగానని చెప్పింది కాజల్.

అలా ఎన్నో మలుపులు తిరిగిన వీరి ప్రేమకథ చివరకు పెళ్లితో సుఖాంతమైంది. 2020 అక్టోబర్‌లో కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.