Begin typing your search above and press return to search.

పెట్టుబ‌డుల్లో చంద‌మామ సేఫ్ గేమ్!

కాజ‌ల్ న‌టిగా బిజీగా ఉన్న స‌మ‌యంలోనూ ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెలిగేవారు. వృత్తి ప‌ర‌మైన జీవితాన్ని నిర్మించుకోవ‌డంలోనూ కాజ‌ల్ నూరుశాతం స‌క్సెస్ అయ్యారు.

By:  Srikanth Kontham   |   22 July 2026 12:00 AM IST
పెట్టుబ‌డుల్లో చంద‌మామ సేఫ్ గేమ్!
X

పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్రకథానాయకురాలిగా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ తెర వెనుక ఆర్థిక ప్రణాళికల విషయంలో ఎంతో ఆచరణాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపుతుంటారు. అయితే కాజల్ మాత్రం స్టార్టప్ పెట్టుబడుల కంటే సురక్షితమైన రియల్ ఎస్టేట్ రంగాన్నే తొలి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నట్లు వెల్లడించారు. తన గత అనుభవాల నేప‌థ్యంలోనే కాజ‌ల్ ఈ నిర్ణయానికి వచ్చారు. గతంలో తాను చేసిన కొన్ని స్టార్టప్ పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఎలాంటి లాభాలను అందించలేదన్నారు.

వ్యాపార ప్రపంచంలో సరికొత్త ప్రయోగాలు, అంచనాలు కొన్నిసార్లు తలకిందులవుతాయని వ్యక్తిగత అనుభవంతో కాజ‌ల్ గ్రహించారు. ఈ వైఫల్యాలే ఆమెను మరింత జాగ్రత్తగా అడుగులు వేసేలా చేశాయి. భారీ లాభాల ఆశతో కూడిన హై-రిస్క్ పెట్టుబడుల పట్ల అమ్మ‌డు స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. స్వతంత్రంగా స్వయంగా వ్యాపార నిర్ణయాలు తీసుకునేంత ఆత్మవిశ్వాసం, అనుభవం ప్రస్తుతానికి తనకు లేవని నిజాయితీగా అంగీకరించారు. వ్యాపార మెలకువలు పూర్తిగా అవగతం కానప్పుడు ఇతరులపై ఆధారపడి పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదన్నారు.

ఈ కారణాల వల్లే త‌న సంపాదనను అత్యంత రిస్క్‌తో కూడిన మార్గాల్లో కాకుండా కాల పరీక్షకు నిలిచిన రియల్ ఎస్టేట్ రంగంలో మళ్లించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. భూములు, స్థిరాస్తుల కొనుగోలు దీర్ఘకాలికంగా నష్టాలను నివారించడమే కాకుండా స్థిరమైన వృద్ధిని ఇస్తాయనే నమ్మకం కాజల్ లో బలంగా ఉంది. ఇది ప్రముఖులలోనే కాకుండా సాధారణ పెట్టుబడిదారులకు కూడా ఆచరణీయమైన మార్గంగా నిలుస్తోంది. కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షిత మార్గాల్లో మళ్లించడంలో సెలబ్రిటీలు కూడా ఎంతో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని కాజల్ ఉదంతం నిరూపిస్తోంది.

ప్రముఖ నటిగా గ్లామర్ ప్రపంచంలో కొన‌సాగుతూనే ఆర్థిక భద్రత విషయానికి వచ్చేసరికి వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడం విశేషం. అతి సాహసాలు చేసి నష్టపోవడం కంటే నిలకడైన ప్రణాళికే మేలని కాజ‌ల్ నిరూపిస్తున్నారు. ఈ తరహా ఆర్థిక నిర్ణయాలు సినిమా రంగానికే పరిమితం కాకుండా అందరికీ వర్తిస్తాయి. రిస్క్ ..సేఫ్టీ మధ్య స‌రైన‌ సంతులనం సాధించడం ద్వారానే భవిష్యత్తును భద్రపరుచుకోవచ్చని కాజ‌ల్ నిరూపిస్తుంది.

కాజ‌ల్ న‌టిగా బిజీగా ఉన్న స‌మ‌యంలోనూ ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెలిగేవారు. వృత్తి ప‌ర‌మైన జీవితాన్ని నిర్మించుకోవ‌డంలోనూ కాజ‌ల్ నూరుశాతం స‌క్సెస్ అయ్యారు. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. 'మ‌గ‌ధీర' లాంటి సినిమాలో మిత్ర‌వింద పాత్ర‌లో న‌టించి ఎంతో మంది న‌టీమ‌ణుల‌కు రోల్ మోడ‌ల్ గ‌తా నిల‌చారు. కాజ‌ల్ త‌ర్వాత త‌రం న‌టులంతా మిత్ర‌వింద లాంటి పాత్ర ఒక్క సినిమాలో పోషించినా? జీవితానికి చాలు అనుకున్న న‌టీమ‌ణులు ఎంతో మంది ఉన్నారు. అప్ప‌ట్లో కాజ‌ల్ క్రేజ్ చూసి ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన తెలుగు అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వారికి అవ‌కాశాలు వ‌చ్చాయా? లేదా? అన్న‌ది ప‌క్క‌న బెడితే? కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌భావం తెలుగు అమ్మాయిల్లో ఆ రేంజ్ లో ఉండేది.