Begin typing your search above and press return to search.

నా కొడుకు చూసి గర్వపడే మూవీ ఇదే : కాజల్‌

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్‌ మాట్లాడుతూ రామాయణం సినిమా గురించి స్పందించింది. భవిష్యత్తులో నా కొడుకు నీల్‌ కిచ్లు 'రామాయణం'లోని నా పాత్రను చూస్తే తప్పకుండా గర్విస్తాడు.

By:  Ramesh Palla   |   7 July 2026 5:00 PM IST
నా కొడుకు చూసి గర్వపడే మూవీ ఇదే : కాజల్‌
X

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్‌ ఇప్పుడు కాస్త జోరు తగ్గిందని చెప్పక తప్పదు. సాధారణంగా పెళ్లి తర్వాత సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ యాక్టర్స్ సినిమాలకు దూరంగా ఉంటారు. కానీ కాజల్ అగర్వాల్‌ మాత్రం సినిమాల్లో కంటిన్యూ అవుతూనే ఉంది. పెళ్లి తర్వాత చాలా సినిమాలను చేసిన కాజల్ అగర్వాల్‌ ప్రస్తుతం 'రామాయణం' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. రణబీర్‌ కపూర్‌ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించబోతుండగా, సాయి పల్లవిని సీత పాత్రలో చూడబోతున్నాం. ఇక కన్నడ రాక్ స్టార్‌ యశ్‌ ను ఇప్పటికే రావణ్‌ పాత్రకు ఎంపిక చేయడం, పలు సీన్స్‌ను షూట్‌ చేయడం కూడా జరిగింది. సినిమాలో అత్యంత కీలకమైన రావణ్‌ భార్య మండోదరి పాత్రకు గాను కాజల్‌ అగర్వాల్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే మండోదరిగా కాజల్‌ నటించేసింది.

కాజల్‌ అగర్వాల్‌ తనయుడు నీల్‌ కిచ్లు...

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్‌ మాట్లాడుతూ రామాయణం సినిమా గురించి స్పందించింది. భవిష్యత్తులో నా కొడుకు నీల్‌ కిచ్లు 'రామాయణం'లోని నా పాత్రను చూస్తే తప్పకుండా గర్విస్తాడు. అలాంటి పాత్రను చేయడం చాలా సంతోషంగా ఉంది. నా కొడుకును దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రస్తుతం సినిమాలను కమిట్‌ అవుతున్నట్లుగా కాజల్‌ పేర్కొంది. ప్రస్తుతం నీల్‌ కిచ్లు చిన్న పిల్లాడే అయినప్పటికీ అతడికి సినిమాల గురించి అవగాహన ఉందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా నీల్ కి రామాయణం అంటే చాలా ఇష్టం. అందులోని పలు పాత్రల గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటాడని కాజల్‌ చెప్పుకొచ్చింది. రామాయణం కథను ఎంతో ఆసక్తిగా నీల్‌ కిచ్లు వింటాడని, అలాగే టీవీలోనూ చూస్తాడని, అలాంటి రామాయణం సినిమాలో నేను నటించడం వల్ల నీల్‌ కిచ్లు కచ్చితంగా గర్విస్తాడని, చాలా సంతోషిస్తాడని కాజల్‌ అంది.

రామాయణంలో కాజల్‌ పాత్ర...

నా కొడుకు పెద్దయ్యాక నా సినిమాలు చూసి మా అమ్మ చాలా మంచి పాత్రలు చేసింది, గొప్ప సినిమాల్లో భాగస్వామి అయిందని గర్వించాలని కోరుకుంటున్నాను. అందుకు తగ్గట్లుగానే కథల ఎంపిక, సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లుగా కాజల్‌ పేర్కొంది. ప్రతి రోజు మా ఇంట్లో ఏదో ఒక సమయంలో రామ్‌లీలా జరుగుతుందని, రామాయణం గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటామని కాజల్ అంది. అందుకే భవిష్యత్తులో నా కొడుకు నేను మండోదరి గా నటించినందుకు తప్పకుండా సంతోషిస్తాడంది. తను పెద్ద అయ్యాక మొదట చూడాల్సిన రామాయణం అని, అందులో నేను ఉండటం చూసి చాలా సంతోషించడం మాత్రమే కాకుండా గర్వపడుతాడు అంది. నీల్ కిచ్లు గురించి మాట్లాడిన సమయంలో కాజల్‌ అగర్వాల్‌ ఎమోషనల్‌ అయ్యింది, తన కొడుకు గర్వించే విధంగా సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు పేర్కొంది.

నితేష్ తివారీ రామాయణంలో రణ్‌బీర్‌ కపూర్‌..

రామాయణం సినిమా విషయానికి వస్తే ఇప్పటికే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిందని తెలుస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రామాయణం సినిమాపై దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు రామాయణం నేపథ్యంలో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. అయినా కూడా మళ్లీ రామాయణం ను కొత్తగా చూడాలనే ఆశతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సినిమాను రెండు మూడు పార్ట్‌లుగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎన్ని పార్ట్‌లుగా సినిమా వస్తుంది అనేది ఇంకా క్లారిటీగా మేకర్స్ చెప్పడం లేదు. ప్రస్తుతానికి ఈ ఏడాది దీపావళికి విడుదల ఉండే అవకాశం ఉంది. రామాయణం మూవీ అన్ని భాషల్లో కలిపి, ప్రపంచ వ్యాప్తంగా రూ.5000 కోట్లు వసూళ్లు చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్‌ మూవీగా రామాయణం నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.