గ్లామర్ వెనుక అసలు నిజం! డెలివరీ తర్వాత వెయిట్ లాస్‌పై కాజల్ షాకింగ్ రివీల్
గ్లామర్‌ను కాపాడుకోవడం వెనుక ఆమె పడ్డ కష్టం, దాగివున్న అసలు నిజాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ఆ విశేషాలు చూద్దాం..
By: Madhu Reddy | 30 May 2026 1:30 PM ISTటాలీవుడ్ అందాల చందమామ పెళ్లై, ఒక బిడ్డకు తల్లైనా తరువాత కూడ అందం అస్సలు తగ్గలేదు. తన క్యూట్ లుక్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తూనే ఉంది. అయితే, ప్రెగ్నెన్సీ తర్వాత అంతా అనుకుంటున్నట్టుగా ఆమె సులభంగా బరువు తగ్గలేదు. గ్లామర్‌ను కాపాడుకోవడం వెనుక ఆమె పడ్డ కష్టం, దాగివున్న అసలు నిజాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ఆ విశేషాలు చూద్దాం..
మగధీర బ్యూటీ మైండ్ బ్లోయింగ్ జర్నీ:
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' సినిమాతో కాజల్ ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా స్టార్ హీరోల పక్కన నటిస్తూ టాప్ పొజిషన్‌కు చేరింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, ఓ బాబుకు జన్మనిచ్చింది.
డెలివరీ తర్వాత అసలైన కష్టం:
బిడ్డ పుట్టిన తర్వాత బాడీ షేప్ మారడం ఏ మహిళకైనా సహజం. కాజల్ కూడా దీనికి మినహాయింపు కాదు. "బిడ్డ పుట్టాక లైఫ్ అంత ఈజీగా లేదు. హార్మోన్ల మార్పులు, మూడ్ స్వింగ్స్ చాలా ఇబ్బంది పెట్టాయి. అందరూ అనుకున్నట్టు బరువు తగ్గడం అస్సలు తేలిక కాలేదు" అంటూ కాజల్ డెలివరీ తర్వాత తాను పడ్డ కష్టాన్ని బయటపెట్టింది.
సైజ్ ముఖ్యం కాదు.. బిడ్డే ముఖ్యం:
గతంలో కాజల్ ఒక పర్ఫెక్ట్ సైజ్ మెయింటైన్ చేయాలని తపన పడేదట. కానీ తల్లి అయ్యాక తన ఆలోచన మారింది. "ఇప్పుడు నాకు తగ్గాల్సిన కొన్ని కిలోల బరువుకంటే, నా బిడ్డ ఆరోగ్యం, అతని శ్రేయస్సే ఎక్కువగా ఆలోచన కలిగిస్తోంది. అందుకే ‘సైజ్ జీరో’ అనే విషయాన్ని ఇప్పుడు చాలా తేలికగా తీసుకుంటున్నానని ఆమె ప్రాక్టికల్‌గా చెప్పింది.
గ్లామర్ వెనుక అసలు రహస్యం:
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంతో క్రమశిక్షణ, కష్టం ఉంటాయని కాజల్ మాటలను బట్టి అర్థమవుతోంది. కఠినమైన వర్కౌట్లు, సరైన డైట్ పాటిస్తూనే, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇచ్చి మళ్లీ తన పాత రూపానికి వచ్చింది. అందుకే సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఈ బ్యూటీకి క్రేజ్ తగ్గలేదు.
క్రేజీ ప్రాజెక్టులతో బిజీ: ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 2026లో ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ది ఇండియా స్టోరీ'తో పాటు, డార్క్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'విశాఖ' (ఆర్య రీమేక్) వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని భారీ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
స్టార్ హీరోయిన్ అయినా, సామాన్య మహిళ అయినా ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే మార్పులు ఒకటే అని కాజల్ నిరూపించింది. కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా, ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ గ్లామర్‌ను ఎలా కాపాడుకోవాలో చూపిస్తూ అందరికీ రోల్ మోడల్‌గా నిలుస్తోంది మన చందమామ.
