రైతుల కోసం చందమామ రంగంలోకి!
తాజాగా సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఇంత వరకూ ఈ సినిమా స్టోరీ ఎలాంటిది అన్నది ఇంత వరకూ బయటకు రాలేదు. తాజాగా సినిమా స్టోరీ ఏంటి? అన్నది బయటకు వచ్చింది.
By: Srikanth Kontham | 8 Oct 2025 3:00 PM ISTరైతుల కోసం హీరోయిన్ కాజల్ అగర్వాల్ రంగంలోకి దిగిందా? రైతే రాజు అన్న నినాదాన్ని గట్టిగా వినిపించ బోతుందా? అంటే అవుననే తెలుస్తోంది. బాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ .. చేతన్ డీకే దర్శకత్వంలో `ది ఇండియా స్టోరీ` అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రేయాస్ తల్పడే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా మొదలై నెలలు గడుస్తోంది. తాజాగా సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఇంత వరకూ ఈ సినిమా స్టోరీ ఎలాంటిది అన్నది ఇంత వరకూ బయటకు రాలేదు. తాజాగా సినిమా స్టోరీ ఏంటి? అన్నది బయటకు వచ్చింది.
రైతు ఆత్మహత్యల నేపథ్యం:
ఇందులో కాజల్ రైతుల కోసం పోరాటం చేసే న్యాయవాది పాత్రలో కనిపించనుంది. వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతోన్న రైతు ఆత్మహత్యల గురించి చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఏటా ఆత్మ హత్యలకు పాల్ప డుతున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక, దిగుబడి రాక చేను కోసం తీసుకొచ్చిన పురుగు మం దును తానే తాగి తనువు చాలిస్తోన్న ఘటనలు ఉన్నో. నిత్యం పత్రికల్లో రైతు ఆత్మహత్యలు కనిపిస్తూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు చూస్తూనే ఉన్నాయి.
రైతుల కోసం పోరాట పటిమతో:
కానీ ఏ ప్రభుత్వం రైతు కోసం పని చేయలేదు. రైతు నడ్డి విరచే కార్యక్రమాలే చేస్తోంది తప్ప రైతు బాగుకోరిన ప్రభుత్వం లేదు. పండిన పంటలో పెద్దల కుంభకోణం మరో ఎత్తు. నిలువునా రైతు దోపిడికి ఎలా గురవుతున్నాడో? తెలిసిందే. అప్పట్లో పంజాబ్ రైతు ఉద్యమాలు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే. ఇలాంటి అంశాలు ఆధారంగా `ది ఇండియా స్టోరీ` తెరకెక్కుతోంది. రైతుల తరుపున కోర్టులో పోరాటం చేసే యోధురాలి పాత్రలో కాజల్ కనిపించనుంది.
కాజల్ కెరీర్ లోనే గొప్ప పాత్రగా:
కాజల్ కెరీర్ లో ఇంత వరకూ ఇలాంటి పాత్ర పోషించలేదు. కమర్శియల్ చిత్రాల్లోనూ నటించింది. సినిమాలో నాలుగు పాటలకు..రొమాంటిక్ సన్నివేశాలకు పరిమితమైన పాత్రల్లోనే కనిపించింది. అలాంటి నటి కెరీర్ పరంగా చూస్తే ఇది సవాల్ విసిరే రోల్. నటిగా గొప్ప గుర్తింపును తీసుకొచ్చే పాత్ర ఇది. కమర్శియల్ గా సక్సస్ అయినా కాకపోయినా? ఆమె కెరీర్ లోనే చిరస్థాయిగా నిలిచిపోయే రోల్ అవుతుంది అన్న ధీమాను కాజల్ వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాతో పాటు కాజల్ మరో రెండు సినిమాలు కూడా చేస్తోంది. బాలీవుడ్ `రామాయణం`లో నటిస్తోంది. అందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే `ఇండియన్ 3`లో కూడా నటించింది. కానీ ఆ సినిమా రిలీజ్ డిలే అవుతుంది.
