కాజల్ రేంజ్ కు ఇది అవసరమా?
హీరోయిన్లు సాధారణంగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తోపాటు లోకల్ బిజినెస్ ల ఇనాగరేషన్స్ లో పాల్గొనడం కామన్. చాలా మంది హీరోయిన్లు ఆ ట్రెండ్ ను ఫాలో అవుతూ వస్తున్నారు.
By: M Prashanth | 7 March 2026 10:45 AM ISTహీరోయిన్లు సాధారణంగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తోపాటు లోకల్ బిజినెస్ ల ఇనాగరేషన్స్ లో పాల్గొనడం కామన్. చాలా మంది హీరోయిన్లు ఆ ట్రెండ్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అలా పాల్గొన్న టాలీవుడ్ చందమామ, బ్యూటీ కాజల్ అగర్వాల్ చేసిన ఓ రీల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. అనేక స్టార్ హీరోల సరసన నటించి వరుస హిట్స్ అందుకున్న ఆమెకు ఇప్పటికీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్న కాజల్ అగర్వాల్, పలు ఈవెంట్లు, బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు.
తాజాగా జరిగిన ఒక మండి రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు కూడా పాల్గొన్నాడు. దీంతో అతడు.. కాజల్ తో మాట్లాడి.. ఆ తర్వాత ఒక రీల్ చేశాడు. ఆ వీడియోలో ఉప్పల్ బాలు ఉత్సాహంగా మాట్లాడుతూ కాజల్ తో సరదాగా రీల్ చేయగా, ఆమె కూడా అతని స్టెప్స్ కు రెస్పాండ్ అయింది.
ఆ రీల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఫుల్ వైరల్ గా మారింది. దీంతో అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు కాజల్ అగర్వాల్ ను పబ్లిక్ ఈవెంట్లలో చూసి ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ ఇలాంటి చిన్న ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అదే సమయంలో పాల్గొనడం ఆమె ఇష్టం కానీ.. ముఖ్యంగా యూట్యూబర్లతో కలిసి రీల్ చేయడం పై కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓపెనింగ్ కు రావడం ఓకే కానీ యూట్యూబర్ తో రీల్ ఎందుకు? అంటూ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మరోవైపు కొందరు అభిమానులు మాత్రం కాజల్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు.
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన నేపథ్యంలో సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి కనిపించడం సాధారణమేనని చెబుతున్నారు. పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడం, ఫ్యాన్స్ తో కలవడం ద్వారా సెలబ్రిటీలు మరింత దగ్గరవుతారని వారు అభిప్రాయపడుతున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గినా కాజల్ కు ఇప్పటికీ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండడంతో ఆమె ప్రతి పబ్లిక్ అప్పియరెన్స్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు చిన్న వీడియో పెద్ద చర్చకు కారణమైంది. దీనిపై కాజల్ అగర్వాల్ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.
