Begin typing your search above and press return to search.

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

పెద్ద బడ్జెట్ సినిమాల్లో కాజల్ అగర్వాల్‌కు సరైన స్క్రీన్ స్పేస్ దక్కడం లేదని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఇండియన్ 2’లో చివర్లో చిన్న గ్లింప్స్ మాత్రమే కనిపించగా, ‘ఆచార్య’లో ఆమె పాత్రను తొలగించారు. ఇప్పుడు ‘రామాయణ’లోనూ పరిమిత సన్నివేశాలకే ఆమె పాత్ర పరిమితమైందనే చర్చ జరుగుతోంది. ప్రమోషన్లలో కాజల్ పేరును ఉపయోగించకుండా, తెరపై మంచి పాత్రలు ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   7 Nov 2026 1:00 AM IST
కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది కాజల్. దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేశారు. ఇప్పటికీ కాజల్ సినిమా ఉందంటే ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇటీవల ఆమె సినిమాలను చూస్తుంటే అభిమానుల్లో ఒక ప్రశ్న మొదలవుతోంది. కాజల్‌ను వలం ప్రమోషన్ల కోసమే ఉపయోగించుకుంటున్నారా.. అని తెగ హర్ట్ అవుతున్నారు కాజల్ అభిమానంలు.

ప్రస్తుతం కాజల్ పెద్ద బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. కానీ ఆ సినిమాల్లో ఆమె పాత్రలకు సరైన ప్రాధాన్యత ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రమోషన్ల సమయంలో మాత్రం కాజల్ పేరును ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. దీంతో ఆమె అభిమానులు కూడా తమ అభిమాన హీరోయిన్‌ను తెరపై చూడాలని థియేటర్లకు వెళ్తున్నారు. తీరా సినిమా చూస్తే ఆమె పాత్ర చాలా తక్కువగా ఉండటం వారిని నిరాశకు గురిచేస్తోంది.

కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమా ఇందుకు ఒక ఉదాహరణగ. ఈ సినిమాలో కాజల్ నటిస్తుందని తెలిసినప్పటి నుంచి ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ మొదటి భాగంలో ఆమె పూర్తిస్థాయిలో కనిపించలేదు. సినిమా చివర్లో ఆమె పాత్రకు సంబంధించిన చిన్న గ్లింప్స్ మాత్రమే చూపించారు. దీంతో అభిమానులు నిరాశపడ్డారు.

ఇప్పుడు రామాయణం ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇలాంటి విషయం జరిగింది. ఈ సినిమాలో కాజల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కేవలం రెండు సీన్లల్లో మాత్రమే కనిపించింది. ఇక చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కూడా కాజల్ నటించినప్పటికీ చివరకు ఆమె పాత్రను తొలగించారు. మెగాస్టార్‌తో కలిసి కాజల్‌ను తెరపై చూడాలని ఆశించిన అభిమానులకు అది అది కూడా నిరాశ కలిగించింది.

కాజల్ తన కెరీర్‌లో ఎన్నో మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ ఆమెకు మంచి గుర్తింపు, అభిమానుల ఆదరణ ఉన్నాయి. అలాంటి నటికి పెద్ద సినిమాల్లో అవకాశం ఇస్తున్నప్పుడు కథలో కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాలి.

కేవలం ప్రమోషన్లలో కాజల్ పేరును ఉపయోగించుకుని, సినిమాలో మాత్రం ఆమెకు సరైన పాత్ర ఇవ్వకపోవడం అభిమానులను బాధపెడుతోంది. కాజల్‌ను చూడాలని థియేటర్లకు వచ్చే అభిమానులు..ఇదేమి శాడిజం.. మమ్మల్ని ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని కామెంట్ పెడుతున్నారు. ఎందుకంటే కాజల్ అభిమానులు కోరుకునేది పోస్టర్లలో ఆమెను చూడటం కాదు.. వెండితెరపై మంచి పాత్రలో చూడటం.