Begin typing your search above and press return to search.

కాజల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

ప్రస్తుతం కాజల్ అగర్వాల్‌కు NBK111 కూడా అలాంటి ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 Jun 2026 3:32 PM IST
కాజల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
X

ఒక స్టార్ హీరోయిన్ కెరీర్‌లో కొన్ని సినిమాలు కేవలం మరో ప్రాజెక్ట్‌లా కాకుండా, భవిష్యత్తును నిర్దేశించే మలుపులుగా నిలుస్తాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్‌కు NBK111 కూడా అలాంటి ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాజల్, పెళ్లి మరియు మాతృత్వం తర్వాత మళ్లీ కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కంబ్యాక్ తర్వాత ఆమె చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో కొత్త అవకాశాల వరదను తీసుకురాలేకపోయాయి.

ఇలాంటి సమయంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న NBK111 కాజల్‌కు అత్యంత కీలక ప్రాజెక్టుగా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమెకు కేవలం సాంగ్స్ కు, గ్లామ‌ర్ కు మాత్ర‌మే పరిమితమయ్యే పాత్ర కాకుండా కథలో ప్రభావం చూపే పాత్ర దక్కినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా కాజల్ పాత్రల ఎంపికలో కూడా మార్పు కనిపిస్తోంది. పారితోషికం కంటే పాత్రకు ఉన్న ప్రాధాన్యత, కథలో ఆమె పాత్ర ప్రభావం వంటి అంశాలనే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటోందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. NBK111 విషయంలో కూడా అదే అంశం కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. భారీ స్టార్ సినిమా కావడం ఒక కారణమైతే, తన పాత్రకు ఉన్న వెయిటేజీ మరో ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. కెరీర్ ఈ దశలో హీరోయిన్లకు గుర్తుండిపోయే పాత్రలే ఎక్కువకాలం ప్రయోజనం చేకూరుస్తాయని కాజల్ బాగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, కాజల్‌కు సీనియర్ స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు రావడం. ఒకప్పుడు యంగ్ హీరోలతో ఎక్కువగా జతకట్టిన కాజల్, ఇప్పుడు కథకు బలం చేకూర్చే పాత్రలతో పాటు సీనియ‌ర్ స్టార్ సినిమాల్లో భాగమవుతూ తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తోంది. ఇక బాలకృష్ణతో ఆమె ప‌ని చేయ‌డం ఇది రెండోసారి. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవ‌డంతో, ఆ స‌క్సెస్ సెంటిమెంట్ ఇప్పుడు NBK111కు కూడా కలిసొస్తుందా అనే చర్చ అభిమానుల్లో కనిపిస్తోంది. డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని మాస్ కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేసే తీరు కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది.

ఒక్క ముక్క‌లో చెప్పాలంటే NBK111 స‌క్సెస్ అయితే, కాజల్ కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కంబ్యాక్ తర్వాత ఇంకా పూర్తిస్థాయి బిజీ షెడ్యూల్‌ను అందుకోలేకపోయిన ఆమెకు ఈ సినిమా గేమ్‌చేంజర్‌గా మారొచ్చు. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో బలమైన పాత్రల కోసం దర్శకులు, నిర్మాతలు కాజల్‌ను మరింతగా పరిశీలించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఒక స‌క్సెస్‌ఫుల్ సినిమా కొన్నిసార్లు కెరీర్ దిశనే మార్చేస్తుంది. ప్రస్తుతం కాజల్ ఆశలు కూడా NBK111పై అదే స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తోంది.