బీచ్‌లో చందమామ కాజల్ తుళ్లింత
బెబో కరీనా కపూర్ ఖాన్, దీపిక పదుకొనే, కియరా అద్వాణీ, కత్రిన కైఫ్... ఇప్పుడు చందమామ కాజల్ అగర్వాల్ బీచ్ సెలబ్రేషన్స్ ఇంటర్నెట్ లో గుబులు పుట్టిస్తున్నాయి.
By: Sivaji Kontham | 12 Nov 2025 9:25 AM ISTనేటితరం కథానాయికలు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తున్నారు. ఇలాంటి వేడుకలకు కొందరు పెళ్లయిన భామలు కూడా వ్యతిరేకం కాదు. బెబో కరీనా కపూర్ ఖాన్, దీపిక పదుకొనే, కియరా అద్వాణీ, కత్రిన కైఫ్... ఇప్పుడు చందమామ కాజల్ అగర్వాల్ బీచ్ సెలబ్రేషన్స్ ఇంటర్నెట్ లో గుబులు పుట్టిస్తున్నాయి.
గౌతమ్ కిచ్లుని పెళ్లాడి ఒక అందమైన బేబి బోయ్ - నీల్‌కి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సంసార జీవనంలో సరిగమల్ని ఆస్వాధిస్తోంది. భర్త, వారసుడి గురించిన ధ్యాసలోనే గడిపేస్తోంది. అయితే బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుతో జాలీ లైఫ్ ని ఫుల్ చిల్లింగ్ గా ప్లాన్ చేయడంలో కాజల్ తెలివితేటల్ని ప్రశంసించకుండా ఉండలేం. వీలున్నంత వరకూ భర్తతో కలిసి విదేశీ విహారయాత్రలను ఆస్వాధిస్తోంది కాజల్.
ఇప్పుడు చందమామా కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఆస్ట్రేలియాలో విహరిస్తున్నారు. అక్కడ అందమైన బీచ్ లు, అభయారణ్యాల సొగసు గురించి కాజల్ పోయెటిగ్గా స్పందించింది. తాజాగా ఎరుపు రంగు డిజైనర్ ఫ్రాకు లో కాజల్ బీచ్ ఫోజులు వైరల్ గా మారాయి. కాజల్ ఇసుకలో స్టిక్ పట్టుకుని అద్భుతమైన ఫోజులివ్వగా దానిని క్యాప్చుర్ చేసిన విధానం ఆకట్టుకుంది. కాజల్ రెడ్ కలర్ థై స్లిట్ గౌనులో మంత్రముగ్ధం చేస్తోంది.
ఈ సెలబ్రేషన్ పై కాజల్ ఇలా తన కవితాత్మక హృదయాన్ని ఇలా ఆవిష్కరించింది. ''గోల్డ్ కోస్ట్, క్వీన్స్‌ల్యాండ్‌లో గొప్పగా టైమ్ పాస్ అయింది. సూర్యుడు, సర్ఫింగ్ .. చుట్టూ చిరునవ్వులు.. స్వచ్ఛమైన బీచ్‌లు, మనోహరమైన లేన్‌ల నుండి హాయిగా ఉండే కేఫ్‌ల వరకు ప్రతి క్షణం పోస్ట్‌కార్డ్ లాగా అనిపించింది'' అని రాసింది. కేఫ్ లలో తనకు నచ్చిన వాటిని ఆస్వాధించడం తనకు అత్యంత ఇష్టమైనది అని కూడా చెప్పింది కాజల్.
అంతేకాదు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ను కూడా చూశానని చెప్పిన కాజల్ భారతదేశం గెలిచినందుకు దేవుడికి థాంక్స్ కూడా చెప్పింది. ఇది నిజంగా అత్యుత్తమ అనుభూతిని కలిగించిందని ఆనందం వ్యక్తం చేసింది.
ఇదే కాదు.. ఆస్ట్రేలియాలోని అద్భుతమైన వన్యప్రాణుల అభయారణ్యం కరంబిన్ వైల్డ్ లైఫ్ గురించి ప్రస్థావిస్తూ, ఈ అభయారణ్యంలోని జీవులను రక్షించే ఆసుపత్రి, కరంబిన్ శాంక్చువరీ వంటి వాటిని వీక్షించానని తెలిపింది. అక్కడ వన్యప్రాణుల సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఈ ఆస్పత్రి, సంరక్షణ కేంద్ర నిర్వాహకులు అద్భుతమైన పని చేస్తున్నారని కీర్తించింది కాజల్. వన్యప్రాణులను రక్షించడం.. మన అందమైన జీవులు ఎప్పటికీ అంతరించిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని చెప్పింది. కాజల్ తదుపరి రామాయణం- పార్ట్ 1, రామాయణం పార్ట్ 2లో కనిపించనుంది. ది ఇండియన్ స్టోరి, ఐ యామ్ గేమ్ అనే చిత్రాలలోను నటిస్తోంది.
