Begin typing your search above and press return to search.

కాజ‌ల్‌కు యాక్సిడెంట్.. నిజ‌మెంత‌?

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌మాదానికి గుర‌య్యారా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది.

By:  Sivaji Kontham   |   9 Sept 2025 9:39 AM IST
కాజ‌ల్‌కు యాక్సిడెంట్.. నిజ‌మెంత‌?
X

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌మాదానికి గుర‌య్యారా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. కాజ‌ల్ కి యాక్సిడెంట్ అయింద‌ని, ప్రాణాల‌తో పోరాడుతోంద‌ని ప్ర‌చారం సాగిపోతోంది. అయితే ఈ విష‌యం చివ‌రికి కాజ‌ల్ దృష్టికి వ‌చ్చింది. వెంట‌నే తాను సుర‌క్షితంగా, క్షేమంగా ఉన్నాన‌ని బాగానే ఉన్నాన‌ని, త‌ప్పుడు పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించింది.

ఈరోజు సాయంత్రం నుంచి ఈ పుకార్లు వేడెక్కిస్తుండ‌గా, వెంట‌నే కాజ‌ల్ స్పందించి ఇలా వివ‌ర‌ణ ఇచ్చారు. నేను ఒక ప్రమాదంలో ఉన్నానని (ఇప్పుడు లేను!) చెబుతున్న‌ కొన్ని నిరాధారమైన వార్తలను నేను చూశాను. నిజాయితీగా చెప్పాలంటే ఈ వార్త‌లు చాలా వినోదభరితం. ఈ ప్ర‌చారం అంతా అవాస్త‌వం. దేవుడి దయవల్ల నేను పూర్తిగా క్షేమంగా, సురక్షితంగా.. చాలా బాగానే ఉన్నాను. అలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. సానుకూలత, సత్యంపై మనం దృష్టి కేంద్రీక‌రించాలి`` అని X లో రాసింది.

కొన్నిసార్లు సెల‌బ్రిటీలు బ‌తికి ఉండ‌గానే మ‌ర‌ణించార‌ని కూడా ప్ర‌చారం సాగిపోతుంది. ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్ పెద్ద ప్ర‌మాదానికి గురై ప్రాణాపాయంలో ఉంద‌ని ప్ర‌చారం సాగ‌డంతో అభిమానులు చాలా కంగారు ప‌డ్డారు. కానీ ఈ పుకార్లు ఎక్కడి నుండి ఎలా వచ్చాయో కానీ, ఇలాంటివి దావాన‌లంలా వ్యాపిస్తాయి. అయితే కాజ‌ల్ వేగంగా స్పందించి, ఇలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో అభిమానులను గంద‌ర‌గోళం నుంచి బ‌య‌ట‌ప‌డ‌వేయ‌గ‌లిగారు.