Begin typing your search above and press return to search.

ఆ 35 పేజీల స్క్రిప్ట్ లో ఖైదీ 2 రహస్యం..!

ఖైదీ తర్వాత విక్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని ఇంకాస్త క్రేజ్ తెచ్చేలా చేసింది.

By:  Ramesh Boddu   |   6 Aug 2025 11:32 AM IST
ఆ 35 పేజీల స్క్రిప్ట్ లో ఖైదీ 2 రహస్యం..!
X

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి నాంది పడ్డ సినిమా ఖైదీ. కార్తి హీరోగా వచ్చిన ఈ సినిమా మాస్ అండ్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. కార్తిలోని మాస్ యాంగిల్ ని లోకేష్ కనకరాజ్ బాగా ఎలివేట్ చేశాడు. ఆ సినిమాతోనే లోకేష్ కి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. సౌత్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో లోకేష్ ఒకడని గుర్తించారు ఆడియన్స్. ఖైదీ తర్వాత విక్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని ఇంకాస్త క్రేజ్ తెచ్చేలా చేసింది. ఆ సినిమా ఐతే కమల్ హాసన్ కి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.

ఖైదీ, విక్రం మార్క్ క్రియేట్

లోకేష్ నెక్స్ట్ ఎంత గొప్ప సినిమాలు చేసినా ఆయన పేరు చెప్పగానే ఖైదీ, విక్రం సినిమాలు గుర్తు చేసుకుంటారు ఆడియన్స్. అంతగా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఐతే ఖైదీ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ప్రస్తుతం కూలీ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లోకేష్ ఖైదీ 2 గురించి హింట్ ఇచ్చారు. ఖైదీ 2 కథ కూడా బాగా వచ్చింది. తన దృష్టిలో తనకు మొదట అవకాశం ఇచ్చిన స్టార్ కార్తి. అందుకే ఆయనతో ఖైదీ 2 మరింత భారీగా తీస్తానన్నాడు లోకేష్.

అంతేకాదు ఖైదీ 2 కథ 35 పేజీల స్క్రిప్ట్ ఫైనల్ చేశాడట. అంటే ఈసారి వ్యవహారం వేరే లెవెల్ అనేలా ఉంది. ఖైదీ 2 సినిమా విషయంలో లోకేష్ కమిట్మెంట్ చూస్తే ఆడియన్స్ కి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధమవుతుంది. ఐతే లోకేష్ సినిమా అంటే చాలు స్టార్ క్యామియోలు.. సినిమాటిక్ యూనివర్స్ లు ఎక్స్ పెక్ట్ చేస్తారు. మరి ఖైదీ 2లో లోకేష్ ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తన సినిమాటిక్ యూనివర్స్ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటాడన్నది చూడాలి.

కూలీ సినిమా ప్రమోషన్స్ తో బిజీ..

కూలీ రిలీజ్ అవ్వడమే ఆలస్యం ఖైదీ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడట లోకేష్. విక్రం లో రోలెక్స్ కూడా ఖైదీ 2 లో ఉంటాడా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో నడుస్తుంది. మరి ఆ విషయంలో లోకేష్ ప్లాన్ ఎలా ఉందో చూడాలి. ప్రెజెంట్ కూలీ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు లోకేష్ కనకరాజ్. సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించిన కూలీ సినిమాలో మన కింగ్ నాగార్జున విలన్ గా చేశారు. సినిమాలో శృతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ నటించారు. పూజా హెగ్దే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.