Begin typing your search above and press return to search.

నాగార్జున ఛాన్సిచ్చినా పెద్ద డైరెక్ట‌ర్ మోకాల‌డ్డాడు

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలీదు కానీ, సినీప‌రిశ్ర‌మ‌లో ఒకే `ఒక్క ఛాన్స్` చాలా మంది జీవితాల‌ను మార్చేసిన సంద‌ర్భాలున్నాయి.

By:  Sivaji Kontham   |   21 Jan 2026 2:00 PM IST
నాగార్జున ఛాన్సిచ్చినా పెద్ద డైరెక్ట‌ర్ మోకాల‌డ్డాడు
X

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలీదు కానీ, సినీప‌రిశ్ర‌మ‌లో ఒకే `ఒక్క ఛాన్స్` చాలా మంది జీవితాల‌ను మార్చేసిన సంద‌ర్భాలున్నాయి. ఉదాహ‌ర‌ణకు సందీప్ వంగా `యానిమ‌ల్‌` చిత్రంలో అవ‌కాశం చాలా మంది జీవితాల‌ను మార్చేయ‌డ‌మే కాదు.. వారంద‌రి పారితోషికాలు పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది.

అయితే నటుడు, `మనం సైతం` సేవా సంస్థ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ ని అలాంటి ఒకే ఒక్క ఛాన్స్ వ‌రించినా కానీ దుర‌దృష్ట దేవ‌త త‌న నెత్తి మీద‌ కూచుంద‌ని ఆవేదన చెందారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విష‌యాల‌ను చెబుతూనే, ఒకానొక దుర‌దృష్ట‌కరమైన విషయంపై కాదంబ‌రి ఓపెన‌య్యారు.

త‌న‌కు ద‌ర్శ‌కుడిగా నాగార్జున గారు అవకాశం ఇచ్చినా కానీ, ఒక పెద్ద‌ దర్శకుడు ఆ అవ‌కాశం కోల్పోవ‌డానికి కార‌కుడ‌య్యాడ‌ని తెలిపారు. దాదాపు 16 మంది సినీపెద్ద‌ల స‌మ‌క్షంలో నాగార్జున గారు నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాని ప్ర‌క‌టించారు. అశ్వ‌నిద‌త్, కేఎస్ రామారావు వంటి పెద్ద నిర్మాతలు అక్క‌డే ఉన్నారు. సినిమాని ప్ర‌క‌టిస్తున్నాను.. నీ టైటిల్ ఏంటి? అని కాదంబ‌రిని నాగార్జున ప్ర‌శ్నించారు. `బావ‌- ఏ ల‌వ‌బుల్ మ్యాన్`.. ఓన్లీ నాగార్జున అని చెప్ప‌గానే, అంద‌రూ క్లాప్స్ తో మెచ్చుకున్నారు. పోసాని కృష్ణ ముర‌ళి, జ‌ల‌దంకి స‌హా దాదాపు 20 మంది ర‌చ‌యిత‌లు నాకు స‌హ‌కారం అందించారు.. అని కూడా కాదంబ‌రి తెలిపారు. కానీ నాకు ఫేట్ బాలేదు. ఆ స‌మ‌యంలో అకార‌ణంగా ఆ అవ‌కాశం కోల్పోయాన‌ని కాదంబ‌రి అన్నారు. అవ‌కాశం వ‌స్తే ఒక‌లా, కోల్పోతే ఇంకోలా ప‌రిశ్ర‌మ‌లో మాట్లాడుకుంటార‌ని కూడా కాదంబ‌రి ఆవేద‌న చెందారు.

అయితే నాగార్జున‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వ‌చ్చినా, క‌థ‌తో మెప్పించినా దానిని ఆపేసిన పెద్ద ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అనేది మాత్రం కాదంబ‌రి చెప్ప‌నే లేదు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా కూడా కొన్నిసార్లు సమీకరణాల వల్ల అవకాశాలు ఎలా చేజారిపోతాయో కాదంబ‌రి వివరించారు.

కాదంబరి కిరణ్ గురించి ..

కాదంబ‌రి సీనియ‌ర్ న‌టుడు... వందలాది తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా మెప్పించారు. `మ‌నం సైతం` అనే సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమలోని పేద కార్మికులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఎంతో సహాయం అందిస్తున్నారు. ఇటీవ‌ల‌ ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇండస్ట్రీలోని తన అనుభవాలను చెబుతుంటే అవి ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.