కాంత కోసం గట్టిగానే ప్లాన్ చేశారుగా!
రానా, దుల్కర్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ ఇద్దరూ మొదటి నుంచే కంటెంట్ కు పెద్ద పీట వేస్తూ సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Oct 2025 10:00 PM ISTదుల్కర్ సల్మాన్ పేరుకే మలయాళ నటుడు కానీ ఆయనకు తెలుగులో కూడా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బోలెడంత క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆయన కాంత అనే సినిమా చేస్తున్నారు. ప్రముఖ హీరో రానా దగ్గుబాటితో కలిసి కాంతను నిర్మిస్తున్నారు దుల్కర్.
సెప్టెంబర్ లోనే రావాల్సిన కాంత
పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల కాంత వాయిదా పడింది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా సంథింగ్ డిఫరెంట్ గా ఉండనుందని అర్థమవుతుంది.
సౌత్ ఇండియాలోనే బెస్ట్ టెక్నీషియన్లతో..
రానా, దుల్కర్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ ఇద్దరూ మొదటి నుంచే కంటెంట్ కు పెద్ద పీట వేస్తూ సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ సినిమా విషయంలో వీరిద్దరూ ఎలాంటి రాజీ పడటం లేదని సినిమాకు వర్క్ చేసే టెక్నికల్ టీమ్ ను చూస్తుంటే అర్థమవుతుంది. అందులో భాగంగానే కాంత సినిమాకు సౌత్ ఇండియాలోని బెస్ట్ టెక్నీషియన్స్ ను తీసుకున్నారు.
దీపావళి తర్వాత కాంత రిలీజ్
సెల్వమణి శెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కాంత మూవీకి రైటర్ గా సర్పట్ట పరంబరై మూవీకి వర్క్ చేసిన తమిజ్ ప్రభ కథ అందించగా, మహానటి సినిమాకు వర్క్ చేసిన డినీ సాలో సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఎడిటర్ గా లెవెల్లిన్ ఆంటోనీ, ఆర్ట్ డైరెక్టర్ గా కెప్టెన్ మిల్లర్, సర్పట్ట పరంబరైకి పని చేసిన రామలింగం భాగమయ్యారు. తాజా సమాచారం ప్రకారం కాంత మూవీని దీపావళి తర్వాత రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
హైప్ పెంచాలని కోరుతున్న నెటిజన్లు
అయితే దీపావళి తర్వాత సినిమాను రిలీజ్ చేయాలనుకుంటే మేకర్స్ ఇప్పటికైనా కాంత మూవీకి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు పెద్దగా హైప్ లేదని, ఏదైనా మంచి కంటెంట్ ను రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచాలని అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం రానా, దుల్కర్ కలిశారంటే వారిద్దరూ కలిసి ఏదో భారీగానే ప్లాన్ చేస్తారని భావిస్తున్నారు. రీసెంట్ గా కొత్త లోక సినిమాతో నిర్మాతగా బ్లాక్ బస్టర్ ను అందుకున్న దుల్కర్ కు కాంత ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.
